లేడిడాన్‌ సంగీతా లాకర్‌ బద్దలు: రూ. 2కోట్లవిలువైన ఆస్తి జప్తు, కోల్‌కతాకు ఏపీ పోలీస్

చిత్తూరు: 'ఎర్రచందనం' స్మగ్లర్ సంగీత చటర్జీ లాకర్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 2కోట్ల విలువైన రెండున్నర కిలోల బంగారు, కిలో వెండి నగలు, పలు అపార్ట్ మెంట్లకు సంబంధించి పత్రాలు, విదేశీ కరెన్సీని పోలీసులు మీడియాకు ప్రదర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్‌ మార్కొండ లక్ష్మణన్ రెండో భార్య అయిన సంగీత.. ఆ దందాలో చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించిన చిత్తూరు పోలీసులు ఇటీవల ఆమెను అరెస్టు చేయడం, బెయిల్‌ పొంది సంగీత ఉడాయించడం తెలిసిన విషయమే.

ఈ క్రమంలో సంగీత లాకర్‌ నుంచి నగలు, డాక్యుమెంట్లను అదనపు ఎస్పీ రత్న ఆధ్వర్యంలో సీజ్‌ చేశారు. చిత్తూరు ఏఎస్పీ రత్న తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన లక్ష్మణన్ గత కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించేవాడు. దీంతో అతన్ని 2014లో అరెస్టు చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన లక్ష్మణన్ తిరిగి స్మగ్లింగ్ వ్యవహారాలను ప్రారంభించడంతో 2015 డిసెంబర్ నెలలో అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు. అతనిపై చిత్తూరు జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి.

sangeeta chatterjee's broken by AP Police

జైలులో లక్ష్మణన్ ఉండగా అతని రెండో భార్య అయిన ఎయిర్ హోస్టెస్ సంగీతా ఛటర్జీ ఎర్రచందనం అక్రమరవాణాలో కీలక భూమిక పోషించడతో పాటు భారీ స్థాయిలో నగదు లావాదేవీలను నిర్వహిస్తుండేది. ఆమెపై చిత్తూరు జిల్లాలోని యాదమరి స్టేషన్‌లో కేసు నమోదుకేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 9న చిత్తూరుకు చెందిన డిఎస్పీ గిరిధర్ అధ్వర్యంలో కోల్‌కతాలోని సంగీతా ఇంటిపై దాడులు నిర్వహించి, రెండు బ్యాంకు లాకర్లను, విలువైన ఆస్తుల పత్రాలను, 9 సెల్ ఫోన్లను, స్వాధ్వనం చేసుకొన్నారు.

యూకో బ్యాంకు లాకర్లలో ఉన్న సుమారు రెండు కోట్ల విలువ చేసే బంగారు నగలు ఇతర ఆస్తుల పత్రాను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నా సంగీతా చటర్జీకి సోమవారం వరకు బెయిల్ ఉన్న నేపధ్యంలో తదుపరి విచారణ కోసం కూడా తమ కస్టడీకి తీసుకుంటామన్నారు.

గతంలో ఆమెను కోల్‌కతాలో అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదయ్యారని, అప్పటి నుంచి తనకు ఆరోగ్యం సక్రమంగా లేదని బెయిల్‌ను పొడిగించుకొంటూ వస్తున్న సంగీతా సోమవారంతో బెయిల్ గడువు ముగియనుండటంతో అనంతరం చట్టప్రకారం ఆరెస్టు చేసి చిత్తూరుకు తీసుకు రానున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+