దసరా సెలవుల ప్రారంభం వేళ బిగ్ అలర్ట్, తాజా నిర్ణయంతో..!!
తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి ప్రారంభం అవుతోంది. దసరా పండుగ వేళ సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్ణయించారు. అయినప్పటికీ... ఈ నెల 10వ తేదీ రెండో శనివారం.. 11వ తేదీ ఆదివారం కావటంతో దసరా పండగ సెలవులకు తోడయ్యాయి. దీంతో విద్యార్థులకు అక్టోబర్ 10వ తేదీ నుంచే పాఠశాల సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి. 10వ తేదీ నుంచి సెలవులు కావటంతో.. రేపు (శుక్రవారం) దాదాపు అన్ని పాఠశాలలు మధ్యాహ్నం నుంచే సెలవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఈ మేరకు పేరెంట్స్ కు సందేశాలు పంపుతున్నారు. ఇక.. దసరా పండుగ సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్కూళ్లలో కొనసాగుతున్న ఫార్మేటివ్-2 పరీక్షలు నేటితో (అక్టోబర్ 8) ముగియనుండటంతో, శుక్రవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం నుంచే విద్యార్థులు తమ పేరెంట్స్ తో ఊళ్లకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా.. సెలవుల రద్దీ అంచనా వేసిన రైల్వే - ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు లను అందుబాటులోకి తెచ్చాయి.

అయితే.. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 87 సెలవులు రానుండగా, 229 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉండనున్నాయి. కేవలం దసరా మాత్రమే కాకుండా రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా ప్రత్యేకంగా సెలవుల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. సెలవులను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా రాబోయే పరీక్షలకు సిద్ధం కావడానికి ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలవులు ఒకటే విధంగా ఇవ్వటం తో రెండు రాష్ట్రాల్లోనూ ప్రయాణాల సంఖ్య పెరగనుంది. అయితే, వాతావరణంలో వస్తున్న మార్పు లకు అనుగుణంగా విద్యార్ధుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications
