'రణబాలి' మూవీపై రష్మిక షాకింగ్ రివ్యూ .. హార్ట్ టచింగ్ తో పాటు..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందాన్న కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'రణబాలి' ఈ మూవీని టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. రణబాలి మూవీ రిలీజ్ కు కేవలం వారం రోజులే ఉన్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాను నాలుగు ఎపిసోడ్​స్ డాక్యుమెంట్​ సిరీస్ ​గా తీసుకువస్తున్నారు. అలాగే ఇటీవల ప్రముఖ యాంకర్ సుమతో విజయ్, రష్మిక, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఇక రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. బ్రిటిష్ వాళ్లపై పోరాడే సింగనమల రణబాలి పాత్రలో ఆయన నట విశ్వరూపం ప్రదర్శించనున్నారు. ఈ మూవీకి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం అజయ్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నీరవ్ షా సినిమాటోగ్రాఫర్​ గా పనిచేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన రణబాలి గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం రణబాలి ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా రణబాలి మూవీపై హీరోయిన్ రష్మిక కీలక వ్యాఖ్యలు చేసింది.

RashmikaMandanna has stated that Ranabaali the upcoming movie is heart touching film viral comments

రణబాలి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' పేరిట ఇన్ స్టా వేదికగా అభిమానులతో రష్మిక స్పెషల్ చిట్​ చాట్ నిర్వహించారు. మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినిమా ఎండింగ్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అడగ్గా అందుకు రష్మిక బదులిస్తూ 'సినిమా మొత్తం చూసి మీరే ఆస్వాదించాలి. స్టోరీ ఏంటనేది నేను చెప్పను' అని తెలిపింది. అలాగే ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హార్ట్ బ్రేకింగ్ అని అలాగే హార్ట్ వార్మింగ్ అని తెలిపింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+