మహేష్‌బాబు ఆ ఒక్కటి అసలు తినరు.. జీవితంలో అసలు ముట్టుకోరు!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును చూడగానే అందరిలోనూ మెదిలే మొదటి ప్రశ్న.. "ఈ వయసులోనూ ఇంత యంగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?" అని! 50 ఏళ్లు దాటినా నేటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంటారు. ఈ గ్లోబ్-ట్రాటర్ ఫిట్‌నెస్ వెనుక గంటల తరబడి చేసే వ్యాయామాలు మాత్రమే కాదు, ఆయన తూచా తప్పకుండా పాటించే కఠినమైన డైట్ సీక్రెట్ కూడా దాగి ఉంది.
పాలు, నెయ్యికి పూర్తిగా నో!
అందరూ ఎంతో ఇష్టంగా తినే కొన్నింటిని మహేష్ బాబు తన జీవితంలో అస్సలు ముట్టుకోరు. ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్ అయిన పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, నెయ్యి వంటి వాటికి ఆయన చాలా దూరం పాటిస్తారు. వీటితో పాటు ప్రాసెస్డ్ షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, జంక్ ఫుడ్‌ను కూడా తన డైట్ నుంచి పూర్తిగా తొలగించారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో కొల్లాజెన్ తగ్గిపోయి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని, అందుకే తాను వీటికి దూరంగా ఉంటానని ఆయన పలుమార్లు చెప్పారు

మరి సూపర్‌స్టార్ ఏం తింటారు?
మహేష్ బాబు మంచి ఫుడీ అయినప్పటికీ, తినే విషయంలో ఎప్పుడూ ఒక క్రమశిక్షణను ఫాలో అవుతారు. అందరిలాగే ఇడ్లీ, పూరి, బోండాలు, బిర్యానీ వంటి అన్నీ తింటారు కానీ.. ఏదీ అతిగా తినరు. "నాకు పూరి ఇష్టం కదా అని ఇరవై తినేయను.. రెండు, మూడు తింటే ఆపేస్తాను" అని ఆయన నవ్వుతూ చెబుతుంటారు. ఇక ఆయనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. చిన్నతనంలో అమ్మమ్మ చేతి వంటల రుచులు తనకింకా గుర్తున్నాయని, ఆ జ్ఞాపకాలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
పాన్ వరల్డ్ రేంజ్‌లో 'వారణాసి'!
సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు చేసేదే ఏడాదికి ఒక్క సినిమా అయినప్పటికీ, ఈసారి రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం ఆయన మూడేళ్ల సమయాన్ని కేటాయించారు. ఈ సినిమాతో ఆయన కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా పాన్ వరల్డ్ స్టార్‌గా అవతరించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకవైపు కఠినమైన ఫిట్‌నెస్ డైట్.. మరోవైపు ప్రయోగాత్మక సినిమాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. తన అంకితభావంతో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
