సంపుతావా కొట్టి కొట్టి సూర్యదేవా.. 40 - 50 డిగ్రీలు కొడుతున్నవ్..!

తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు ఎండాకాలంలో కంటే అధికంగా ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటుగా రాత్రి సమయంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఇది ఎండాకాలమా.. లేక వానకాలమా.. అని ప్రజలు ఆవేదనలో ఉన్నారు. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కాగా.. భద్రాచలం, మహబూబ్ నగర్ లో 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక రుతుపవనాల నిష్క్రమణ కారణంగా వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పటికే ప్రారంభం అయిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తాజాగా ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనుదిరిగాయి. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న కాలంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎండలో ఎక్కువ సమయం గడపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు నీటిని ఎక్కువగా తీసుకోవాలని.. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Telangana Scorching heat temperatures reaching 37 degrees Celsius in several places in telangana

ఇక ఎండ తీవ్రత, వేడి వాతావరణం వల్ల వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎండ పెరిగిన కొద్దీ దాహం, నీరసం, నిస్సత్తువ, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+