రైతులపై పోలీసు కేసు - హరీష్ హెచ్చరిక..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కీలక స్థాయికి చేరింది. సీఎం రేవంత్ కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటజీతో సిద్దం అవుతోంది. కాగా.. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారంలో రైతుల పైన కేసులు నమోదు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీని పైన మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు.

పంటలు కాపాడుకునేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' ఖాతా వేదికగా స్పందించారు. 'కళ్ల ముందే ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య. రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటు'.. అంటూ హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 'ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు.

బెంగళూరుకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు - స్టేషన్లు, షెడ్యూల్...!!
బెంగళూరుకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు - స్టేషన్లు, షెడ్యూల్...!!
harish-rao-slams-police-cases-against-farmers-protesting-for-jurala-water-release

హరీష్ రావు హెచ్చరిక

దీనికి కొనసాగింపుగా.. 'మీ చేతగానితనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి. కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా?. పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం?. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు'.. అని వ్యాఖ్యానించారు. 'నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?. సాగునీరు లేక, కరెంట్‌ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి.. కేసులు అక్రమ కేసులు పెడతారా?. ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా?. రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం' అని హరీశ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+