Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ వైజాగ్ షిఫ్టింగ్ ముహుర్తం ఖరారు- మంత్రి అప్పలరాజు ప్రకటన..

ఏపీలో తాము ఎక్కడ నుంచి పాలన చేయాలో చెప్పే అర్హత మీకెక్కడిది అంటూ వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇవాళ విపక్షాలను ప్రశ్నించారు. ఏపీలో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే మీకెందుకు కడుపుమంట అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఇంత బానిసత్వం అవసరమా అని అడిగారు. తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పవన్ కల్యాణ్ సంసారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు, లోకేష్, రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అడ్రస్ హైదరాబాద్ అని, వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి మనం ఎక్కడ ఉండాలో నిర్దేశిస్తారని మంత్రి అప్పలరాజు తెలిపారు. మన రాష్ట్రం గురించి అడ్డగోలు రాతలు రాస్తారని, అసలు వీళ్ళల్లో ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు ఉందా అని అడిగారు. వీళ్లు మనం ఎక్కడ నుంచి పరిపాలన చేయాలో చెప్తారన్నారు. అచ్చెన్నాయుడు ఇంత బతుకు బతికి.. చివరికి బానిస బతుకు బతుకుతున్నారని విమర్శించారు.

seediri appalaraju reveals ys jagans vizag shifting date, says opposition have no right to decide

రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని వారు అమరావతిలోనే కార్యాలయాలు ఉండాలని చెప్తూ ఉంటే మీరు వాళ్ళకు బాకాలు ఊదుతూ, వాళ్ళ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారంటే, విశాఖ పనికిరాదని మాట్లాడుతున్నారంటే.. మీకు రాజకీయ అవకాశాలు ఇచ్చి పెద్ద పెద్ద నాయకుల్ని చేసిన ఈ ప్రాంతానికి మీరు చేస్తున్నది ఏంటని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి అప్పలరాజు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఆస్తులూ ఇక్కడే ఉన్నాయి కదా అన్నారు.

విశాఖకు పరిపాలన వ్యవస్థ వస్తే ప్రజలకు మంచి జరుగుతోందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయని, ఉద్యోగ, విద్యా అవకాశాలు పెరుగుతాయని, ఈ ప్రాంత పిల్లలకు ఇక్కడే ఉపాధి కలుగుతుందన్నారు. మన ప్రాంత ప్రజల ఆస్తులకు విలువ పెరుగుతుందన్నారు. విశాఖను ఆనుకుని ఉన్న అనకాపల్లి, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎక్కడెక్కడకో వెళ్ళిపోతున్నారుగా, మీ కొడుకు రామ్మోహన్ నాయుడు వారానికి ఒకసారి విదేశాంగ శాఖకు మావాళ్లు అరబ్ దేశాల్లో, సింగపూర్, మలేషియా, ఆఫ్రికాలో చిక్కుకుపోయారని లెటర్లు రాస్తారన్నారు. వాళ్ళందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా.. అటువంటి అవకాశాలు కల్పించాలంటే రాజకీయ నిర్ణయం జరగాలన్నారు.

చంద్రబాబు సీఎంగా పనిచేసినప్పుడు రాజధాని అమరావతి అని డిక్లేర్ చేసి ఎక్కడ ఉన్నాడని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. హైదరాబాద్ హోటల్ ఉండి దాన్నే అధికారికంగా నివాసంగా చూపించారన్నారు. ఆరోజు ఈ రూల్స్, రెగ్యులేషన్స్ లేవా అని అడిగారు. జగన్ విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి ఉంటానంటే తప్పేంటని ప్రశ్నించారు. సీఎంవో అనేది ఫలానా చోట ఉండాలని రూల్ లేదని, ఆయన ఎక్కడ ఉంటే అదే కార్యాలయమన్నారు. ఫస్ట్ వీక్ నుంచి సీఎం జగన్ విశాఖలో అందుబాటులో ఉండబోతున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+