జయసుధ పొలిటికల్ రీ ఎంట్రీ, పార్టీ..నియోజకవర్గం ఫిక్స్..!?
సినీ నటి జయసుధ పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్దమయ్యారా. కొంత కాలంగా రాజకీయంగా జయసుధ క్రియాశీలకంగా లేరు. గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పని చేసారు. ఆ తరువాత పలు పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు. అయితే.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. తాజాగా బీజేపీలో జయసుధ చేరుతున్నట్లు ప్రచారం సాగింది. కాగా.. తాజాగా జయసుధ ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
సినీనటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఈ సారి జయసుధ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని పొలిటికల్ సర్కిల్స్ టాక్. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా జయసుధ పనిచేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ఏరి కోరి సికింద్రాబాద్ నుంచి జయసుధను పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో జయసుధ గెలిచారు. వైఎస్ మరణం తరువాత జయసుధ పార్టీ వ్యవహారాలకు.. రాజకీయాలకు క్రమేణా దూరం అయ్యారు.

2016 లో టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో ఎంట్రీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతోనూ జయసుధ సంప్రదింపులు చేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలో చేరిన జయసుధ ఇప్పుడు మరోసారి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక..జయసుధ సొంత గ్రామం కృష్ణా జిల్లాలోనే ఉంది. అందుకే జయసుధ ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. తనకు రాజకీయంగా ఆహ్వానం అందితే వస్తానని తేల్చి చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కొబ్బరి తోటలు ఎండిపోవ డానికి, తెలంగాణ దిష్టి వ్యాఖ్యలను తప్పుపట్టారు. అదే సమయంలో తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలతో జయసుధ చూపు మరోసారి వైసీపీ వైపు ఉందనే చర్చ మొదలైంది.
అదే సమయంలో తెలంగాణలోనే తిరిగి కాంగ్రెస్ లో గ్రేటర్ ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. జయసుధకు ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోనే మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగుతారని చెబుతున్నారు. అయితే.. జయసుధ మాత్రం ఎక్కడా తాను ఏ పార్టీలో చేరుతానేది స్పష్టత ఇవ్వటం లేదు. ఏపీ అయితే వైసీపీ వైపే జయసుధ అడుగులు వేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో.. జయసుధ పొలిటికల్ రీ ఎంట్రీ పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications