రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..!

పశ్చిమగోదావరి జిల్లాలోని తన నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఆకివీడు పట్టణంలో శిథిలావస్ధలో ఉన్న గొంతెనమ్మ గుడి స్ధానంలో రామాలయం నిర్మించేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ గట్టి షాక్ తలిగింది. గొంతెనమ్మ గుడి కూల్చేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు (high court).. ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఆకివీడు గ్రామం పెద్దపేటలో శిధిలంగా ఉన్న గొంతెనమ్మ గుడిని కూల్చటానికి రఘురామ కృష్ణంరాజు బుల్డోజర్లతో బయలుదేరగా.. దీన్ని సవాల్ చేస్తూ స్థానిక వంగ జోష్ణాదేవి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న రఘురామ కృష్ణంరాజు.. ఇవాళ స్వయంగా హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదించారు.

setback to deputy speaker raghurama krishnam raju in high court on akiveedu temple issue

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 202, 209 ప్రకారం మున్సిపల్ కమిషనర్ అనుమతి లేకుండా మతపరమైన నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్లు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ,, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రూల్ నెంబర్ 3 క్లాస్ (f) ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఏ నిర్మాణానికైనా కలెక్టర్ ఎన్వోసీ అవసరమని వాదించారు. ఏ మత సంబంధమైన నిర్మాణాలైనా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ స్థలంలో ఏ మతపరమైన నిర్మాణాలు కూడా అనుమతించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.

setback to deputy speaker raghurama krishnam raju in high court on akiveedu temple issue

దీంతో ప్రభుత్వం తరఫున ఈ కేసులో హాజరైన లాయర్ శిరీష. రామాలయం నిర్మాణంలో అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని హైకోర్టుకు హామీ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే శిథిలంగా ఉన్న భవనాన్ని కూల్చడం గాని, కొత్త భవనం కట్టడం గానీ జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన చర్యలు చేపట్టరాదని తెలిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాకే రామాలయం కడతామని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన నిర్మాణాలు చేపట్టవద్దన్న హైకోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+