జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్-సంచైతకూ ఎదురుదెబ్బ-అశోక్ కే మాన్సాస్ పగ్గాలు

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును తొలగించి సంచైతను నియమించిన ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలోనే సింగిల్ బెంచ్ కొట్టేయగా.. ఇవాళ డివిజన్ బెంచ్ సైతం దీన్ని సమర్ధించింది. దీంతో మాన్సాస్ ట్రస్టులో జగన్ సర్కార్ పప్పులుడకవని తేలిపోయింది. ఈ తీర్పుతో అశోక్ గజపతిరాజు యథావిధిగా మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

మాన్సాస్ వివాదం

మాన్సాస్ వివాదం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయనగరానికి చెందిన పూసపాటి రాజ వంశీయుల మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజును ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్ధానంలో అన్న కూతురు సంచైత గజపతిరాజును తెరపైకి తీసుకొచ్చింది. ఆమెను అర్ధరాత్రి జీవోలతో ఛైర్ పర్సన్ గా నియమించేసింది. ఆమె ఏడాదికి పైగా ఆ పదవిలో కొనసాగారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది.

అశోక్ ను సమర్ధించిన హైకోర్టు

అశోక్ ను సమర్ధించిన హైకోర్టు

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న పూసపాటి రాజవంశ మగ వారసుడైన అశోక్ గజపతిరాజును తప్పిస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో విచారణ జరిపింది. అశోక్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఆయన్ను తిరిగి మాన్సాస్ ఛైర్మన్ గా నియమించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన మరోసారి మాన్సాస్ ఛైర్మన్ గా పగ్గాలు చేపట్టారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును వైసీపీ సర్కార్ తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. అదే సమయంలో సంచైత గజపతిరాజు కూడా డివిజన్ బెంచ్ లో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు.

జగన్ సర్కార్, సంచైతకు షాక్

జగన్ సర్కార్, సంచైతకు షాక్


మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ తో పాటు సంచైత కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. వీరిద్దరి పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తన తీర్పును ప్రకటించింది. ఇందులో డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్ధించింది. పూసపాటి రాజవంశం నిబంధనల ప్రకారం మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా మగవారసుడైన అశోక్ గజపతిరాజుకే అవకాశం ఉంటుందని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

పరువు పొగొట్టుకున్న సర్కార్

పరువు పొగొట్టుకున్న సర్కార్

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియాకమం విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని కాదని అశోక్ గజపతిరాజును తప్పించి సంచైతను తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ కు హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తప్పలేదు. అశోక్ తొలగింపుపై కోర్టులతో పాటు ఉత్తరాంధ్రలో ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారని తెలిసీ.. ప్రభుత్వం ముందుకే వెళ్లింది. సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినా దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయిచింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ వాదనకే మద్దతు పలకడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఇరుకునపడినట్లయింది. ఇప్పటికే ఫోరెన్సెకి ఆడిట్, విజిలెన్స్ విచారణల పేరుతో మాన్సాస్ లో హంగామా చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా తీర్పు చెంపపెట్టుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+