YS Vijayamma: కడపలో వారికే ఓటేయండి-విజయమ్మ వీడియో రిలీజ్..!

ఏపీలో మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తల్లి, దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ ట్విస్ట్ ఇచ్చారు. పిల్లలు జగన్, షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వేళ విదేశాలకు వెళ్లిపోయిన విజయమ్మ ఇవాళ వారిలో ఒకరికి మద్దతు ప్రకటించారు. కడప ఓటర్లకు ఎటు ఓటు వేయాలో చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

కడప లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలంటూ ఇప్పటికే దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబం అంతా ప్రచారం చేసింది. ఇప్పుడు ఇదే బాటలో షర్మిల తల్లి విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని కోరుతూ ఇవాళ వీడియో విడుదల చేశారు.

setback to ys jagan as mother vijayamma urge Kadapa voters to vote for ys sharmila

వైఎస్సార్ ను అభిమానింంచే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కడప ప్రజలకు నా విన్నపం అంటూ ఈ విడియోను విజయమ్మ ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్ బిడ్డ షర్మిల ఎంపీగా పోటీ చేస్తుందని, వైఎస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్ కు పంపాలని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నట్లు కడప ఓటర్లకు ఆమె తెలిపారు. తద్వారా తన మద్దతు కూతురు షర్మిలకే అని విజయమ్మ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే జగన్, షర్మిలలో ఎవరో ఒకరికి మద్దతివ్వలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో విజయమ్మ వీడియోతో క్లారిటీ ఇచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+