Cyclone Arnab: తుపాను ఇప్పుడెక్కడుంది?.. దిశ మారి ఏ జిల్లాకు ప్రమాదం?

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుపాను అత్యంత తీవ్రమైన తుపానుగా రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారింది. గత కొన్ని గంటలుగా ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకు 360 కిలోమీటర్లు, బాపట్లకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగున ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ తుపాను ఈరోజు సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా సాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా తన మార్గాన్ని మార్చుకోనుంది. అక్టోబర్ 28 (బుధవారం) ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Severe Cyclone Arnab Hits Andhra Coast Red Alert Issued Extremely Heavy Rains amp amp School Holidays Declared

దిశ మారితే ఈ జిల్లాకు ముప్పే..

ప్రస్తుతానికి యానాం వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నప్పటికీ, తుపాను చుట్టూ ఉన్న దట్టమైన మేఘాల ప్రభావం వల్ల ప్రయాణ దిశ మారే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ తుపాను తన మార్గాన్ని మార్చుకుంటే, నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఏది ఏమైనా ఇది అత్యంత ఉద్ధృతమైన తుపానుగా మారే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!
Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!

జిల్లాల వారీగా కుండపోత వర్షాల హెచ్చరిక

తుపాను ప్రభావంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనుంది. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

  • అత్యంత భారీ వర్షాలు (రైడ్ అలర్ట్): కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు.
  • భారీ నుంచి అతి భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలు.
  • భారీ వర్షాలు: పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలు.

స్కూళ్లకు సెలవులు

ప్రజా భద్రత, ముఖ్యంగా విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రమాద తీవ్రత ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

  • నేడు, రేపు సెలవు (అక్టోబర్ 27, 28): విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, మన్యం జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తిస్తుంది.
  • అనకాపల్లి జిల్లా: ఇక్కడ ముందస్తుగా అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటుసెలవులు ప్రకటించారు.
  • గుంటూరు జిల్లా: పరిస్థితి దృష్ట్యా ఈరోజు స్కూళ్లకు సెలవు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Cyclone Arnab: భయంకరమైన తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..
Cyclone Arnab: భయంకరమైన తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..

ప్రజలు, జాలర్లకు అత్యవసర సూచనలు

తీరం వెంబడి గాలి వేగం ఊహించని రీతిలో ఉండే అవకాశం ఉన్నందున జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సముద్ర తీర ప్రాధికార సంస్థ ఖచ్చితంగా ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+