• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలనం:దేవాలయంలో లైంగిక వేధింపుల నేపథ్యంలో మహిళ ఆత్మహత్యాయత్నం...ఇస్కాన్ టెంపుల్ మేనేజర్ పై పోలీసుల

By Suvarnaraju
|

అమరావతి: బెజవాడ కనకదుర్గ గుడిలోనూ మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఇటీవలే చీర దొంగతనం ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత ఆరోపించి 24 గంటలు కూడా గడవక ముందే మరో ప్రతిష్టాత్మక ఆలయంలో మేనేజర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా ఉద్యోగి ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

గుంటూరు జిల్లా పెదకాకాని ఇస్కాన్ టెంపుల్ మేనేజర్ రామ్ మురారీ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పవిత్రమైన దేవాలయాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోవడంపై...తమ లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు మహిళా సిబ్బందిపై వివిధ రకాల వేధింపులకు పాల్పడటంపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే...

Sexual harassment: A Woman employee files complaint against ISKON Temple manager

గుంటూరు జిల్లా పెదకాకాని ఇస్కాన్ టెంపుల్ లో ఓ మహిళా ఉద్యోగి పై టెంపుల్ మేనేజర్ రామ్ మురారీదాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం...ఆ వేధింపులు భరింజలేని స్థాయికి చేరుకోవడంతో ఆ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం పెనుప్రకంపనలు రేపుతోంది. భర్త హఠాన్మరణంతో కుటుంబ పోషణ భారమైన సాయి అన్నపూర్ణ అనే మహిళ ఏడేళ్లుగా ఇస్కాన్ టెంపుల్ లో పనిచేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో ఆ మహిళపై కన్నేసిన టెంపుల్ మేనేజర్ రామ్ మురారీదాస్ ఆమెను ఎలాగైనా లోబరుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆమె భర్తలేని ఒంటరి మహిళ కాబట్టి ఏం చేసినా అడిగేవారు ఎవరుంటారన్న ధీమాతో నిత్యం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేస్తున్నాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే నీ ఉద్యోగం ఊడగొడతానంటూ బెదిరిస్తున్నాడు.

రోజురోజుకు మేనేజర్ రామ్ మురారీ దాస్ ప్రవర్తన పెచ్చుమీరిపోతుండటంతో విసిగిపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆలయానికి వచ్చి రామ్ మురారీ దాస్ ను నిలదీశారు. అనంతరం తల్లిదండ్రుల తోడ్పాటుతో బాధితురాలు రామ్ మురారీ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవలి కాలంలో ఆలయంలో పనిచేసే మరో వ్యక్తి సాయి అన్నపూర్ణను పెళ్లి చేసుకునేందుకు ముందుకురాగా దీంతో ఆగ్రహించిన మేనేజర్ రామ్ మురారీ దాస్ తన పై తప్పుడు ప్రచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ కారణంగానే తనపై ఆలయ ఉన్నతాధికారులకు అతడు తప్పుడు ఫిర్యాదులు కూడా చేసాడని చెప్పింది. రామ్ మురారీ దాస్ అసభ్య ప్రవర్తనను ను ప్రశ్నించినందుకు తనను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తాను చెప్పినట్లు చేయాలని మరో ఇద్దరితో కలసి మేనేజర్ రామ్ మురారీ దాస్ బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi: A woman working at a ISKON Temple has lodged a complaint of sexual harassment against Temple Manager after his harassment has reached the peak level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more