షాకింగ్ న్యూస్.. 40 ఏళ్ళు దాటాయా? ప్రతీ ఐదుగురిలో ఒకరికి డయాబెటిస్ ముప్పు!

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి మధుమేహం. మధుమేహం వచ్చిన వారు త్వరగా దానిని గుర్తించకపోవడం వల్ల, మధుమేహంపైన అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది రిస్క్ జోన్ లో పడుతున్నారు. మధుమేహం బారిన పడినవారు అనేక ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోక పోతే శరీరంలోని ఆర్గాన్స్ దెబ్బ తింటాయి.

డయాబెటిస్ పై లాన్సెట్ తాజా నివేదిక
ఇక అటువంటి డయాబెటిస్ విషయంలో భారతీయులలో అవగాహన కాస్త తక్కువగా ఉందని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ఉన్న చాలా మంది ప్రజలకు తాము మధుమేహంతో బాధపడుతున్న విషయం తెలియదని, అలాంటివారు జాగ్రత్తలు తీసుకోవడం లేదని పేర్కొంది. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన ఒక కథనంలో 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని పేర్కొంది.

Shocking news Are you over 40 years One in every five people is at risk of diabetes

Take a Poll

40 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తెలీదు
ఇక మధుమేహంతో బాధపడుతున్న 40 శాతం మందికి తాము డయాబెటిస్ బాధితులుగా మారాము అన్న విషయం తెలియదని పేర్కొన్నారు. భారతీయుల్లో ఆరోగ్య స్పృహ చాలా తక్కువ ఉందని లాన్సెట్ తాజా నివేదిక తేల్చింది. మధుమేహంపైన ముందు జాగ్రత్త చర్యగా బ్లడ్ షుగర్ స్థాయిలను తరచూ పరీక్షించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

46 శాతం మంది మాత్రమే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో
ఇక మధుమేహం బారిన పడ్డామని తెలిసినప్పటికీ జాగ్రత్తలు తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉందని కేవలం 46 శాతం మంది మాత్రమే తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకో గలుగుతున్నారు అని నివేదిక తెలిపింది. వీరంతా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఆహారంలో మార్పులు జాగ్రత్తల ద్వారా డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.

డయాబెటిస్ బాధితులు ప్రతి ఏడుగురిలో ఒకరు భారతదేశంలోనే
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ బాధితులు ప్రతి ఏడుగురిలో ఒకరు భారతదేశంలోనే ఉన్నారని నివేదిక వెల్లడించింది. మధుమేహ బాధితులలో స్త్రీల శాతమే ఎక్కువగా ఉందని, పురుషులు 19.6 శాతంగా ఉంటే స్త్రీలు 20.1 ఒక శాతంగా ఉన్నారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భారతీయులలో మధుమేహంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వారి మధుమేహం విషయంలో అప్రమత్తంగా ఉంటారని నివేదిక తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+