సింగపూర్‌లో సీఎం చంద్రబాబు: రెండోరోజు (ఫోటోలు)
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇఁడియా అని పిలుపునిస్తే తానిచ్చే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ పిలుపుతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజైన గురువారం ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ సెండాన్, సెమెబ్ కార్ప్ డిజైన్ అండ్ కనస్ట్రక్షన్స్, జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా, మీన్ హార్ట్ తదితర సంస్ధల సీఈఓలు పాల్గొన్నారు. సింగపూర్, వ్యాపార రంగంలో, పరిశ్రమల రంగాల్లో ఎవరు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులుకన్న అవకాశాలను వివరించే వీడియోను ప్రదర్శించారు.
అంతక ముందు టాటా ఫియా, సెమెబ్ కార్ఫ్ తదితర విమానయాన సంస్ధల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు ఉన్న అకాశాలను వారికి వివరించారు. ఈరోజు 11.30 గంటలకు ల్యాండ్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్, పాలసీలపై సీఎల్సీ సభ్యుడు మొహీందర్ సింగ్‌తో సమావేశమవుతారు. సమీకృత భూ వినియోగం, రవాణా వినియోగం, ఎలకా్ట్రనిక్ రోడ్ ప్రైసింగ్ ప్రణాళికలపై చర్చిస్తారు.
అనంతరం చంద్రబాబుకు విదేశీ వ్యవహారాల మంత్రి కె. షణ్ముగం విందు ఇస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు టోయపై పట్టణ హెచ్‌డీబీ హబ్‌ను పరిశీలిస్తారు. అధికారుల బృందం గృహ, అభివృద్ధి బోర్డును పరిశీలిస్తుంది. మూడున్నర గంటలకు ఎమెరిటస్ సీనియర్ మినిస్టర్ గో చోక్ టంగ్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం 4.50 గంటలకు ఐటీఈ సెంట్రల్‌కు చంద్రబాబు వెళతారు. అక్కడ గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీపై చర్చిస్తారు.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజైన గురువారం ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబు
సింగపూర్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందాన్ని తమ కెమెరాల్లో బంధిస్తున్న అక్కడి తెలుగు వారు.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబు
సింగపూర్, వ్యాపార రంగంలో, పరిశ్రమల రంగాల్లో ఎవరు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులుకన్న అవకాశాలను వివరించే వీడియోను ప్రదర్శించారు.
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు
అంతక ముందు టాటా ఫియా, సెమెబ్ కార్ఫ్ తదితర విమానయాన సంస్ధల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు ఉన్న అకాశాలను వారికి వివరించారు.












Click it and Unblock the Notifications