సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీ సర్కారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆరు రోజులపాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జనవరి 12 నుంచి జనవరి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు తెలిపింది.
జనవరి 9న రెండవ శనివారం, 10వ తేదీన ఆదివారం కావడంతో మరో రెండు రోజులు కూడా ఈ సెలవులకు కలిసి రానున్నాయి. కాగా, జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు తిరిగి సొంతూళ్లకు తిరిగి రావడంతో ఇళ్లన్నీ సందడిగా మారతాయి. ఇలా అన్ని ఊర్లూ పండగ సంబరాన్ని తెచ్చిపెడతాయి.
అంతేగా, కోడిపందేలు, కొత్త అల్లుళ్లతో సందడి సందడిగా ఉంటాయి రాష్ట్ర గ్రామీణ లోగిళ్లు. తెలుగు లోగిళ్లలో రంగు రంగుల ముగ్గులు, రంగవళ్లికలు ఆకట్టుకుంటాయి. హరిదాసులు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటుతాయి.












Click it and Unblock the Notifications