అయ్యా గణేశా.. శోభాయాత్రల్లో విషాదం.. 24 గంటల్లోనే ఆరుగురు మృతి !
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా శోభాయాత్రలు ప్రారంభమై గణేషుడికి ఘనంగా నిమర్జనం చేపడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని గణేశ్ శోభాయాత్రల సందర్భంగా పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. 24 గంటల వ్యవధి లోనే రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అదుపుతప్పిన ట్రాక్టర్..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లలో వినాయక శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన దినేష్ (10), నరసింహమూర్తి (32), మురళి (33), సూర్యనారాయణ (52)గా గుర్తించారు.

ఈ దుర్ఘటనకు కారణం ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్లు త్రాగేందుకు కిందకు దిగగా.. ట్రాక్టర్‌లో ఉన్న ఓ చిన్నారి వాహనాన్ని స్టార్ట్ చేయడం అని అంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహిస్తున్న సమయంలో స్కార్పియో వాహనం అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కార్పియో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అతడిని పట్టుకొని చితకబాది.. పోలీసులకు అప్పగించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications