చంద్రబాబు బెయిల్ వెనుక పవన్ కల్యాణ్..వెలుగులోకి అసలు నిజాలు
స్కిల్ స్కాంలో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో యాభై రోజుల టీడీపీ నేతల నిరీక్షణకు తెరపడినట్లు అయింది. చంద్రబాబు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చంద్రబాబుకు ఇప్పట్లో బయటకు రావడం కష్టమని టీడీపీ నేతలు భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కోర్టు అనుహ్యంగా చంద్రబాబుకు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేసుకోవాలని తమకు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాదులు కోరడంతో మధ్యంతర బెయిల్ లభించింది. చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ నేతల సంబరాలు అంబరాన్ని అంటాయి. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే చంద్రబాబు బెయిల్ విషయంలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

చంద్రబాబు బయటకు రావడంతో..న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిందని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాను హోరెత్తిస్తుండగా, చంద్రబాబు హెల్త్ ఇష్యూస్ మీదనే ఈ బెయిల్ వచ్చిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని.. న్యాయస్థానం ఎక్కడ కూడా చంద్రబాబు నిర్దోషి అని చెప్పలేదని వైసీపీ గుర్తు చేస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ విషయంలో జనసేన కార్యకర్తలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

#ChandrababuNaidu thankful to @PawanKalyan
— Vasishta (@JSP_12075904) October 31, 2023
Garu. pic.twitter.com/fHaHmZzovy
చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. జగన్ ఇంగ్లాండ్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే... పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ దెబ్బకు దెబ్బ తీశారని పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి జనసేన కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications