నరసాపురం, కాకినాడ, హైదరాబాద్ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే ఇవాళ మరో అలర్ట్ ఇచ్చింది. పండుగల సీజన్ కారణంగా కొన్ని రోజులుగా పెరిగిపోతున్న రద్దీని, టికెట్ల బుకింగ్స్ ను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ లు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని నరసాపురం, కాకినాడ, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణించే పలు రైళ్ల విషయంలో తాజాగా అలర్ట్ జారీ చేశారు. ఈ నెలలో ఈ నగరాల మీదుగా ప్రయాణాలు చేసే వారికి ఈ అలర్ట్ ఇచ్చారు.
తాజాగా సాంకేతిక కారణాలతో దక్షిణ మధ్య రైల్వే నరసాపురం, కాకినాడ, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల మధ్య పలు రైళ్లు రద్దు చేసింది. ఇందులో చర్లపల్లి నుంచి నరసాపురం వెళ్లే రైలు నంబర్ 07144 ను ఈ నెల 25న రద్దు చేశారు. అలాగే నరసాపురం నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 07145 ను ఈనెల 26న రద్దు చేశారు. అలాగే కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 07155ను ఈ నెల 25న రద్దు చేశారు. దీంతో పాటు చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ కు వచ్చే రైలు నంబర్ 07156ను కూడా రద్దు చేశారు.

అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ కు వెళ్లే రైలు నంబర్ 07157ను ఈ నెల 26 రద్దు చేశారు. దీంతో పాటు కాకినాడ టౌన్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే రైలు నంబర్ 07158ను ఈ నెల 27న రద్దు చేశారు. ఇలా ఈ నెల 25, 26, 27 తేదీల్లో పలు రైళ్లు రద్దయ్యాయి. కాబట్టి ఆయా స్టేషన్ల మధ్య ప్రయాణాలు చేసుకునే వారు ముందుగానే ఈ తేదీల్ని గుర్తుపెట్టుకుని ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో రైళ్లు మాత్రం ప్రస్తుతానికి యథావిధిగానే ప్రయాణిస్తున్నాయి.












Click it and Unblock the Notifications