తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..! ఈ స్టేషన్ల మధ్య..!
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని కాకినాడ, నరసాపురం, తెలంగాణలోని హైదరాబాద్, అలాగే బెంగళూరు, చెన్నైతో పాటు మరికొన్ని స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం నడపాలని రైల్వే నిర్ణయించింది.
ఇందులో కాకినాడ టౌన్-మైసూరు మధ్య ప్రతీ సోమ, శుక్రవారాల్లో నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07033 ను ఫిబ్రవరి 27 వరకూ పొడిగించారు. అలాగే మైసూరు నుంచి ప్రతీ మంగళ, శని వారాల్లో నడుపుతున్న మరో ప్రత్యేక రైలు నంబర్ 07034ను ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు. నరసాపురం-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య శుక్ర, శనివారాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు 07153,07154 ను సైతం ఫిబ్రవరి 27, 28 వరకూ పొడిగించారు.

అలాగే ప్రతీ గురువారం హైదరాబాద్ నుంచి బెళగావికి నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07043 ను ఫిబ్రవరి 12 వరకూ, బెళగావి నుంచి హైదరాబాద్ కు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్్ 07044ను ఫిబ్రవరి 13 వరకూ పొడిగించారు. దీంతో పాటు సంత్రగచ్చి నుంచి యలహంకకు ప్రతీ గురువారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 02863ను ఫిబ్రవరి 26 వరకూ, యలహంక నుంచి సంత్రగచ్చికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 02864ను ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు.షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ కు ప్రతీ సోమవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 02841ను ఫిబ్రవరి 23 వరకూ, చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ కు ప్రతీ బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 02842ను ఫిబ్రవరి 25 వరకూ పొడిగించారు.












Click it and Unblock the Notifications