వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల్లేవు.. భయపడను, అది అడగడం లేదు, సెంటిమెంట్‌పై మోడీ యూటర్న్!: బాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Budget Sessions : Chandrababu Naidu Revealed Everything

అమరావతి: ఏపీకి ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మిస్తామని నరేంద్ర మోడీ చెప్పారని, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి చెప్పారన్న మోడీ.. ఇప్పుడు సెంటిమెంటుతో ప్రత్యేక హోదా ఇవ్వమని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన అసెంబ్లీలో బుధవారం మాట్లాడారు.

హోదా మా హక్కు, ఎందుకివ్వరని నేను నిలదీస్తున్నా: అసెంబ్లీలో మోడీపై చంద్రబాబుహోదా మా హక్కు, ఎందుకివ్వరని నేను నిలదీస్తున్నా: అసెంబ్లీలో మోడీపై చంద్రబాబు

ఢిల్లీకి మించిన రాజధాని సహకారానికి సహకరిస్తామని చెప్పారని తెలిపారు. కేంద్రం ఉదారంగా ముందుకు వచ్చి అమరావతికి నిధులు ఇవ్వాలన్నారు. విభజన సమయంలో 11 విద్యాసంస్థలను ప్రకటించారని చెప్పారు. ఐఐటీ తిరుపతికి రూ.3500 కోట్లు కావాలని, కానీ ఇచ్చింది రూ.100 కోట్లు అన్నారు.

ఇవన్నీ మీ బాధ్యత, మేం లెక్క చెప్పలేదా: జైట్లీకి బాబు షాక్, ఇదీ పోలవరం లెక్కఇవన్నీ మీ బాధ్యత, మేం లెక్క చెప్పలేదా: జైట్లీకి బాబు షాక్, ఇదీ పోలవరం లెక్క

11 విద్యా సంస్థలకు ఇంత వరకు 4వేల కోట్లు ఇచ్చారని చెప్పారు. కానీ కావాల్సింది 11వేల కోట్లు అన్నారు. విశాఖ ఐఐఎం, తిరుపతి ఐజర్, గుంటూరుకు ఏజీ వర్సిట ఇస్తామని నిధులు ఇవ్వలేదన్నారు. కడప ఉక్కు కర్మాగారం విషయంలోను నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

 విభజన చట్టంలో పెట్టి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు

విభజన చట్టంలో పెట్టి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు

విభజన చట్టంలో పెట్టి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎందుకు ఇంత ఉదాసీనత అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని పార్టీలు కోరుతున్నా కేంద్రం ఎందుకు కనికరం లేదన్నారు. నాడు విభజన సమయంలో నష్టం చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా హోదా కోరుతోందని, తాను అధికారంలోకి వస్తే హోదాపై ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, మీరు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

 అకౌంట్లు అడిగితే లేనిపోని సమస్యలు

అకౌంట్లు అడిగితే లేనిపోని సమస్యలు

నిర్ణీత గడువులోగా విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలని చెప్పారు. అకౌంట్లు అడిగితే లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పారు. కొత్త రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని అమరావతిని నిర్మించుకుంటామన్నారు. తాను కష్టపడకుండా కేంద్రంపై ఆధారపడుతున్నారని కొందరు చెబుతున్నారని, కానీ అది సరికాదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేశామన్నారు.

సీనియర్ మోస్ట్ నాయకుల్లో నేను ఒకడిని, తెలుగు జాతికి

సీనియర్ మోస్ట్ నాయకుల్లో నేను ఒకడిని, తెలుగు జాతికి

ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుల్లో తాను కూడా మొదటి స్థానంలో ఉంటానని చెప్పారు. నా జీవితాంతం తెలుగు జాతికి రుణపడి ఉంటామని చెప్పారు. ప్రజల మనోభావాలు గౌరవించాల్సి ఉందన్నారు. తాను నిప్పులాంటి మనిషిని అని, నా జీవితం తెరిచిన పుస్తకం అని, ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

 సెంటిమెంట్ తెరపైకి, మోడీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా

సెంటిమెంట్ తెరపైకి, మోడీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా

కొంతమంది మళ్లీ సెంటిమెంట్‌లను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏఏ రాష్ట్రాలకు ఎంతిచ్చారు, జనాభా ప్రాతిపదికన ఎంతిచ్చారనే అంశాలపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తాను కేవలం కేంద్రం పైనే ఆధారపడటం లేదని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని మోడీ చెప్పారని తెలిపారు. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అంటే మిగతా రాష్ట్రాలను ఉదరహిస్తూ సెంటిమెంటుతో హోదాలు ఇవ్వలేమని చెబుతున్నారన్నారు. ఒరియా సెంటిమెంట్, తమిళ సెంటిమెంట్ అని తెరపైకి తెస్తున్నారన్నారు.

ఔటర్ రింగు రోడ్డుకు నిధులు తీసుకోలేదు

ఔటర్ రింగు రోడ్డుకు నిధులు తీసుకోలేదు

షెడ్యూల్ 9, 10లోని అంశాలను అమలు చేయాలన్నారు. యాక్ట్‌ను, విభజనను సమీక్షించుకునే పరిస్థితికి వచ్చామని చెప్పారు. మా ఆర్థిక పరిస్థితి ఏమిటని అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. తాను ఫెడరల్ స్ఫూర్తికి లోబడి ఉన్నానని చెప్పారు. సంపదను సృష్టించే రాష్ట్రాలను ఆదుకోవాలని చెప్పారు. ఆ రోజు హైదరాబాద్ ఔటర్ రోడ్డు నిర్మాణం సమయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకోలేదన్నారు.

 న్యాయపరమైన హక్కుల కోసం.. కేంద్రం నిధులు మన హక్కు

న్యాయపరమైన హక్కుల కోసం.. కేంద్రం నిధులు మన హక్కు

న్యాయపరమైన హక్కుల కోసం తాము నిరంతరం పని చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టులను జూన్ లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. లాలూచీ రాజకీయం తన జీవితంలో లేదన్నారు. నా జీవితం తెలుగు జాతికి శాశ్వతంగా రుణపడి ఉంటుందని తెలిపారు. ఏపీలో కరువు లేకుండా పారద్రోలుతామన్నారు. కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకోవడం మన హక్కు అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సంక్షేమ పథకాలు ఇస్తున్న అంశాలను వివరించారు.

 నా మీద కేసులో లేవు, నిప్పులా బతుకుతున్నా

నా మీద కేసులో లేవు, నిప్పులా బతుకుతున్నా

తన మీద ఎలాంటి కేసులు లేవని, నిప్పులాగా బతుకుతున్నానని చంద్రబాబు చెప్పారు. నిన్న, మొన్న ఇచ్చిన లీకులు చూసి చాలా బాధవేస్తోందన్నారు. సెంటిమెంట్ పేరుతో మళ్లీ రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమకు పరిశ్రమలు ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. సీమకు అనేక మహానగరాలు దగ్గరగా ఉన్నాయన్నారు. విశాఖ మేజర్ హబ్‌గా తయారయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణకు పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గాల పెంపు గురించి అడిగితే తన కోసం అడుగుతున్నానని అంటారని, అందుకే ఆ విషయం అడగడం లేదన్నారు.

English summary
The Chief Minister Nara Chandrababu Naidu said there would be no compromise in protecting the state's interests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X