Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘రాహుల్-చంద్రబాబు మధ్యలో రేవంత్! బ్రాహ్మణి ఎందుకు?’

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.

బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోటవురట్ల సభలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సుధాకర్ బాబు అన్నారు.

బ్రాహ్మణి ఎందుకు?

బ్రాహ్మణి ఎందుకు?

‘చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా? విడాకులు తీసుకుంది నిజం కాదా? చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని బాబు అన్నట్లు పత్రికల్లో వచ్చింది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు నారా బ్రాహ్మణి వెళ్లింది నిజం కాదా? ఆమె ఎందుకు వెళ్లారు?'

రాహుల్-బాబు మధ్యలో రేవంత్

రాహుల్-బాబు మధ్యలో రేవంత్

‘కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్-చంద్రబాబు మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారు. టీడీపీ-కాంగ్రెస్ కొత్త రూపంలో ప్రజల్లోకి రాబోతోంది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'.

బాబు పచ్చి అవకాశవాది.. పవన్ కాళ్లు పట్టుకున్నారు..

బాబు పచ్చి అవకాశవాది.. పవన్ కాళ్లు పట్టుకున్నారు..

చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది అని సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారు. గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నారు. పార్టీకి, తనకు సిద్ధాంతం అంటూ ఉండదు. గెలవడానికి ఏదైనా చేస్తారు. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలాంటి నాయకుడికి మద్దతిస్తున్న టీడీపీ నేతలు నైతిక విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది'.

Recommended Video

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు
    చంద్రబాబుకదే భయం

    చంద్రబాబుకదే భయం

    ‘2019 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. వైయస్ జగన్ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదు. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే తన పని పడతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది. జగన్ సీఎం కాగానే చంద్రబాబు అవినీతిని, దోపిడీని అంతా కక్కిస్తాం' అంటూ సుధాకర్ బాబు హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+