వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో మిట్టల్: విశాఖలో టెలికాం సేవలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తుపాను ప్రభావంతో ధ్వంసమైన ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్ పనురుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, శుక్రవారం సాయంత్రంలోగా 80 శాతం ఎయిర్‌టెల్ వినియోగదార్లకు సెల్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ స్పష్టం చేశారు. గురువారం విశాఖలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల కొన్ని టవర్లు పనిచేయడం లేదని అన్నారు. శుక్రవారం నాటికి 80శాతం సెల్ సేవలు పునరుద్ధరిస్తామని తెలిపారు. సెల్ టవర్ల నిర్వహణ అంశం ప్రైవేటు కాంట్రాక్టర్ల పరిధిలో ఉంటుందని, తుఫాను నేపథ్యంలో వారు సకాలంలో సేవలందించకపోవడం వల్ల సెల్‌సేవలు అందించడంలో కొంతమేర అసౌకర్యం కలిగిందని మిట్టల్ అంగీకరించారు.

బాబు-మిట్టల్

బాబు-మిట్టల్

తుపాను ప్రభావంతో ధ్వంసమైన ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్ పనురుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, శుక్రవారం సాయంత్రంలోగా 80 శాతం ఎయిర్‌టెల్ వినియోగదార్లకు సెల్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాం ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు.

బాబు-మిట్టల్

బాబు-మిట్టల్

గురువారం విశాఖలో ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

బాబు-మిట్టల్

బాబు-మిట్టల్

అనంతరం మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల కొన్ని టవర్లు పనిచేయడం లేదని అన్నారు.

బాబు-మిట్టల్

బాబు-మిట్టల్

సెల్ టవర్ల నిర్వహణ అంశం ప్రైవేటు కాంట్రాక్టర్ల పరిధిలో ఉంటుందని, తుఫాను నేపథ్యంలో వారు సకాలంలో సేవలందించకపోవడం వల్ల సెల్‌సేవలు అందించడంలో కొంతమేర అసౌకర్యం కలిగిందని మిట్టల్ అంగీకరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ఎయిర్‌టెల్ వినియోగదార్లకు రూ. 50 అడ్వాన్స్ టాక్‌టైం ఇవ్వనున్నట్టు మిట్టల్ ప్రకటించారు.

తుఫాను నేపధ్యంలో సెల్ నెట్‌వర్క్ కంపెనీల ప్రతినిధులంతా సమావేశమై బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించే అంశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాం ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఎయిర్‌టెల్ అధినేత మిట్టల్ ఏకాంతంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇతర నెట్‌వర్క్‌లను అనుసంధానం చేసుకుంటూ సెల్ సేవలు అందించేందుకు గల మార్గాలను పరిశీలించాలని సిఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం మన దేశంలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు మరింత తీవ్ర పెనుగాలులను సైతం తట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని సూచించగా, మిట్టల్ అంగీకరించినట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వివరించారు.

English summary
Airtel owner Sunil Mittal on Thursday met Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X