జనసేనకు పడే ఓట్లు కూడా పోయేలా ఉన్నాయ్..
ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ కూడా పవన్‌కు సపోర్ట్ చేశారు. తాజాగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి సైతం పవన్‌కు జై కొట్టారు.

తెలుగు ఇండస్ట్రీలో సురేష్ కొండేటికి మంచి గుర్తింపు ఉంది. గతంలో పలు హిట్ సినిమాలను ఆయన తెలుగులో డబ్బింగ్ చేశారు. సంతోషం పేరిట సినిమా ఆర్టిస్టులకు అవార్డులు కూడా ఇచ్చారాయన మీడియా సమావేశాల్లో హీరో, హీరోయిన్స్‌ను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలిస్తుంటారాయన. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చిన కూడా ఫేమస్ అవ్వడానికే ఆయన ప్రయత్నిస్తుంటారు.తాజాగా ఆయన పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా ఓ పాట పాడారు.
జనసేన కోసం తాను రూపొందించిన పాటను పాడి వినిపించారాయన. అయితే సురేష్ కొండేటి పాడిన పాటపై ఘెరంగా ట్రోల్స్ వస్తున్నాయి. మళ్లీ పాట పాడటానికి ట్రై చేయకు.. ఈ సాంగ్ వల్ల పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవు అని కొందరు కామెంట్స్ చేస్తూంటే...పిఠాపురం ఓటర్లను చంపేస్తారా అంటూ మరికొందరు నెటిజన్లు సురేష్ కొండేటి పాటపై కామెంట్స్ చేస్తున్నారు. సురేష్ కొండేటి పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications