వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్‌ ఘటన .. మరో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో పోర్న్ సైట్ లింక్ గతంలో అందర్నీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే . ఇది టీటీడీకి అప్పట్లో పెద్ద తలనొప్పిగా మారి ఇబ్బంది పెట్టింది. ధర్మ ప్రచారానికి నిర్వహించే ఛానల్ లో ఇలాంటి అశ్లీల పనులు చెయ్యటం దారుణమని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి . అయితే తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఉద్యోగులపై ఎస్వీబీసీ సస్పెన్షన్ వేటు వేసింది.

టీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీటీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీ

 ఏపీలో కలకలం రేపిన ఎస్వీబీసీ అశ్లీల చిత్రాల కేసు

ఏపీలో కలకలం రేపిన ఎస్వీబీసీ అశ్లీల చిత్రాల కేసు

ఎస్వీబీసీ టీవీ ఛానల్ లో అశ్లీల సైట్ లింక్ గతేడాది నవంబర్ లో ఏపీలో కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టిటిడి చైర్మన్ కు ,ఈవో కు దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అప్పుడు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో ఎస్విబీసి ఆఫీసులో టిటిడి విజిలెన్స్ సైబర్ క్రైం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రంగంలోకి దిగిన సైబర్ క్రైం టీమ్ .. అశ్లీల చిత్రాల బాధ్యులపై చర్యలు

రంగంలోకి దిగిన సైబర్ క్రైం టీమ్ .. అశ్లీల చిత్రాల బాధ్యులపై చర్యలు

లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అశ్లీల సైట్స్ చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను గుర్తించింది సైబర్ క్రైమ్ టీం . విధులు నిర్వర్తించకుండా వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించిన అధికారులు సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు . ఇక తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఉద్యోగులపై ఎస్వీబీసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటివరకు పది మందికి ఉద్వాసన పలికిన ఎస్విబిసి తాజాగా మరో ముగ్గురిపై చర్యలు తీసుకుంది .

ఎస్విబిసి ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ , సోమశేఖర్ లపై సస్పెన్షన్ వేటు

ఎస్విబిసి ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ , సోమశేఖర్ లపై సస్పెన్షన్ వేటు

సస్పెన్షన్ కు గురైన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల చిత్రాలు ఉన్నట్లు గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించడంతో మరో ముగ్గురు పై వేటు పడింది. ప్రస్తుతం అశ్లీల చిత్రాలు ఘటనలో ఎస్విబిసి ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ , సోమశేఖర్ ల పై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తోంది.
ఇక పోర్న్ వీడియో లింక్ వివాదంలో ఎస్విబిసి ఉద్యోగులకు గతంలో హైకోర్టు కూడా అక్షింతలు వేసింది.

 గతంలో హైకోర్టును ఆశ్రయించిన విధుల నుండి తొలగించబడిన ఉద్యోగులు , హైకోర్టు అక్షింతలు

గతంలో హైకోర్టును ఆశ్రయించిన విధుల నుండి తొలగించబడిన ఉద్యోగులు , హైకోర్టు అక్షింతలు

ఎస్వీబీసీ ఛానల్ లో పోర్న్ సైట్ లింకుల వివాదంలో బాధ్యులుగా ఉన్నవారిని ఎస్వీబిసి యాజమాన్యం విధుల నుండి తొలగించింది. ఈ నేపథ్యంలో తమకు నోటీసు ఇవ్వకుండా విధుల నుండి తొలగించారు అంటూ సదరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు ఉద్యోగుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడి నిర్ణయాన్ని సమర్ధిస్తూ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా చోటు చేసుకున్న పోర్న్ లింక్ వివాదంపై టీటీడీ తీవ్ర చర్యలు తీసుకుంటున్నట్టు తాజా పరిణామాలతో తెలుస్తుంది .

English summary
Three more have been suspended in connection with a pornographic site links on the SVBC TV channel. Currently, it seems that SVBC editor Krishna Rao and managers Murali Krishna and Somasekhar have been suspended in connection with the pornography incident.The High Court had earlier acquitted SVBC employees in the porn video link controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X