Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ గారు గుడ్ లక్, దళపతి విజయ్ శుభాకాంక్షలు, చంద్రబాబుకు కూడా ఇలా !

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతకాలం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ఇదే సందర్బంలో దేశ, విదేశాల్లోని ప్రముఖులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చరిత్రను తిరగరాశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండో లోక సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయనకు ప్రత్యేకంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా, సినీరంగం నుంచి శుభాకాంక్షలు చెప్పేవారి సంఖ్య ఎక్కువ అయ్యింది.

Tamil star hero Vijay congratulated Pawan Kalyan and Chandrababu Naidu
అల్లుడి దెబ్బకు అడ్రస్ లేకుండాపోయిన అంబటి రాంబాబు, పవన్ ను టార్గెట్ చేస్తే, ఇక్కడ ??

తమిళ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు, నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించారని, ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పార్టీగా జనసేన నిలబెట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారిని నా అభినందనలు అని హీరో విజయ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.

ప్రజలకు సేవ చెయ్యాలనే ఆశతో ఇంతకాలం ఎంతో ఓపికతో, ఓర్పుతో, అంకితభావంతో పని చేసిన పవన్ కల్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అని హీరో విజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా హీరో విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడి గారికి నా అభినందనలు అని హీరో విజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు.


చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే హీరో విజయ్ ఆయన పర్సనల్ ఎక్స్ అకౌంట్ నుంచి కాకుండా ఆయన రాజకీయ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు చెబుతూ రెండు వేర్వేరు పోస్టులు చేశారు.

తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్న విజయ్ ఇటీవల కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చెయ్యదని, తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తోందని తమిళ హీరో దళపతి విజయ్ ఇప్పటికే చెప్పారు. సినీరంగంతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+