నరసరావుపేటలో ఉద్రిక్తత: జల్లయ్య అంత్యక్రియలకు టీడీపీ నాయకులు, అడ్డుకుంటున్న పోలీసులు

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. శుక్రవారం నాడు టిడిపి కార్యకర్త జల్లయ్య పై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన జల్లయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఇక ప్రత్యర్థుల దాడిలో మరణించిన జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ..

నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ..

నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు నరసరావుపేట లోకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జల్లయ్య అంతిమ యాత్రలో పాల్గొనడానికి వస్తున్న టిడిపి నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలువురు టీడీపీ నేతలు నరసరావుపేటకు బయల్దేరడంతో వారు అక్కడికి చేరుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు.

జల్లయ్య హత్యపై మండిపడిన టీడీపీ నేతలు

జల్లయ్య హత్యపై మండిపడిన టీడీపీ నేతలు

ఇదిలా ఉంటే జల్లయ్య అంతిమ యాత్రలో పాల్గొని తీరుతామని తెలుగుదేశం పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నాడు టిడిపి కార్యకర్త జల్లయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. అయితే ఇది వైసీపీ శ్రేణుల పనేనని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న ఫ్యాక్షన్ హత్య అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లతో ఉద్రిక్తత

టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లతో ఉద్రిక్తత

ఇక జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. అలాగే గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో టీడీపీ నేత బుద్ధ వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక పొందుగల వద్ద కొల్లు రవీంద్ర ను, పత్తిపాటి పుల్లారావు లను అరెస్ట్ చేసిన పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నరసరావు పేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టెన్షన్.. టెన్షన్

నరసరావు పేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టెన్షన్.. టెన్షన్

సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్ర ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమను గృహనిర్బంధం చేయడంపై టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పట్టపగలు హత్యలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణం అంటూ మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+