వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ పై పోరులో గేరు మార్చిన టీడీపీ.. అన్ని డైరెక్షన్లలో చంద్రబాబు వ్యూహాత్మక దాడి !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ పై పోరాటం తెలుగుదేశం పార్టీ గేరు మార్చుతున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూనే, మరోపక్క రైతు పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు వంటి ఘటనలపై జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. మరోవైపు విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల నియంత్రణకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఇంకోవైపు ఏపీలో దళితులపై, ముస్లిం మైనారిటీలపై, బీసీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తోంది.

గేరు మార్చిన టీడీపీ .. జగన్ సర్కార్ పై పోరు ఉధృతం

గేరు మార్చిన టీడీపీ .. జగన్ సర్కార్ పై పోరు ఉధృతం

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రంగంలోకి దించి అధికార పార్టీ పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేస్తూనే, మరోవైపు తెలుగు తమ్ముళ్లు కూడా అస్త్ర శస్త్రాలతో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడేలా టీడీపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో నిత్యం తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలతో విరుచుకుపడుతోంది. ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలపై టీడీపీ పోరాటం సాగిస్తుంది .అనేక విధాలుగా ఏపీ సర్కార్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న టిడిపి, వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్ల కాలం గడవడంతో ఇప్పుడు గేరు మార్చి మరింత దూకుడు చూపించాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

రేపటి నుండి రైతు కోసం తెలుగుదేశం ..రైతు సమస్యలపై పోరాటం చేస్తామన్న చంద్రబాబు

రేపటి నుండి రైతు కోసం తెలుగుదేశం ..రైతు సమస్యలపై పోరాటం చేస్తామన్న చంద్రబాబు

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14 నుండి 18వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోనల్ వారిగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో పంటపొలాలు కౌలుకు చేసుకునే పరిస్థితులు లేవని, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం బాగా పెరిగిందని, ఇక రైతులకు ఇచ్చే సబ్సిడీలు నిలిచిపోయాయని, వ్యవసాయ శాఖ మూతపడిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటని మరిచి, రైతులను వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏపీ రైతుల సగటు రుణభారం మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేదన్న చంద్రబాబు

జగన్ పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేదన్న చంద్రబాబు

ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక తాజా పరిణామాలపై ధ్వజమెత్తిన చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు వై.యస్ జగన్ పాలనలో రక్షణ లేదని ధ్వజ మెత్తారు. అక్బర్ బాషా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని పరామర్శించడానికి వెళ్లిన మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ మైనారిటీలకు చేస్తున్న ద్రోహం అని చంద్రబాబు విమర్శించారు. ఇక అక్బర్ బాషా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వైసిపి నాయకులపై కేసు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించిన చంద్రబాబు, ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల బాదుడుతో ప్రజలపై పెను భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు సార్లు కరెంటు చార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై 9 వేల కోట్ల భారం వేశారని మండిపడిన ఆయన మళ్లీ ఇప్పుడు ఆరోసారి పెను భారం మోపారని చెప్పారు.

రేషన్ కార్డుల, పెన్షన్ ల తొలగింపుతో పేదల కడుపు కొడుతున్న జగన్ సర్కార్

రేషన్ కార్డుల, పెన్షన్ ల తొలగింపుతో పేదల కడుపు కొడుతున్న జగన్ సర్కార్


ఆరోసారి విద్యుత్ ఛార్జీలు 2542 కోట్ల రూపాయల మేర పెంచి, ఇప్పటివరకు మొత్తంగా ప్రజల పై 11 వేల 500 కోట్ల భారాన్ని మోపారని చంద్రబాబు విమర్శించారు. కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్తు కొని, ఇక ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులను, వృద్ధుల, వికలాంగుల ,నిరుపేదల పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతుందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు చేసిన అరాచకం లేదని భూ కబ్జాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ తీరుకు నవ్వుతున్న జనాలు .. చంద్రబాబు ధ్వజం

జగన్ తీరుకు నవ్వుతున్న జనాలు .. చంద్రబాబు ధ్వజం

ఇక ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రమంతా చర్చ జరుగుతుందని, జగన్ రెడ్డి వ్యవహార శైలికి జనాలు నవ్వుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీల ఆస్తులకు, క్రిస్టియన్ ఆస్తులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎడిట్ కళాశాల భూములు కాజేయడానికి జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఆస్తిపన్ను పెంపకంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలలో కూడా ఆస్తిపన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ రెడ్డి చేతకాని తనానికి నిదర్శనమని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Recommended Video

క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్న అధ్యక్షుడు బక్కని నర్సింహులు
జగన్ సర్కార్ టార్గెట్ గా ఆందోళనలు ఉధృతం చెయ్యనున్న టీడీపీ

జగన్ సర్కార్ టార్గెట్ గా ఆందోళనలు ఉధృతం చెయ్యనున్న టీడీపీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్న చంద్రబాబు, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువ అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజాక్షేత్రంలో జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని వైపుల నుండి జగన్ సర్కార్ పై పోరాటం సాగించటానికి టిడిపి రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ, అనేక అంశాలపై సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరు సాగిస్తూనే ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

English summary
TDP changed the gear against the fight on ruling YCP in AP. while fighting over public issues, on the other hand, the farmers struggle has begun. Already in the AP, TDP is fighting on a large scale to bring pressure on the Jagan government over incidents such as increasing attacks on women . On the other hand, the government is under pressure to control the skyrocketing petrol, diesel and gas cylinder prices. The AP, on the other hand, is questioning the government's rule on attacks on Dalits, Muslim minorities and BCs. now tdp focusing the farmers problems. chandrababu plan to target the ysrcp for the next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X