'కీలక స్నేహితుడి' నుంచి పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పవన్ కు విషెస్ తెలిపారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'సినీ నటులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంతో, ఆనందంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పవన్ కు విషెస్ తెలియజేశారు. 'జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్మికులతో మాట్లాడి.. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. తెనాలి నియోజక వర్గం కొల్లిపర మండలం అత్తోటలో రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తన సొంత సొమ్మును మృతిచెందిన కౌలు రైతులను ఆదుకున్నందుకు కృతజ్ఞతగా పొలంలో జనసేన పార్టీ చిహ్నాన్ని వరి నాట్లుగా వేశారు. కౌలుకు తీసుకున్న పొలంలో జనసేన లోగో, 'కౌలు రైతుల కోసం పవన్... పవన్ కోసం అత్తోట కౌలు రైతులు' అనే అక్షరాలతో వీటిని నాటారు.












Click it and Unblock the Notifications