లోకల్ వార్ పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వైసీపీ డబ్బు పంచితే ఆ పని చెయ్యండి

స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వీరోచితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని , యువత సత్తా నిరూపించుకునే అవకాశం ఇది అని చెప్పారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు కట్ట వేసేలా ఎన్నికల్లో పని చెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు .

స్థానిక ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చెయ్యాలన్న చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చెయ్యాలన్న చంద్రబాబు

38 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్ధంగా ఎదుర్కొన్నామని గుర్తు చేసిన చంద్రబాబు ఇప్పుడు జరగనున్న స్థానిక ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని, దాడులు, దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం, కోర్టుల్లో న్యాయ పోరాటం చేయాలని తెలిపిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని , ఎన్నికల్లో వైసీపీ లెక్క తేల్చాలని చెప్పారు.

వైసీపీకి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనం అన్న బాబు

వైసీపీకి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనం అన్న బాబు

ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పిన చంద్రబాబు ఒక్క అవకాశం ఇస్తే వైసీపీ గతంలోని సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతుందని చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్న వై సీపీకి మళ్ళీ అవకాశం ఇస్తే ఏమీ మిగిల్చరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆత్మవిశ్వాసమే ఆయుధమని, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమని చెప్పిన బాబు ఈ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, మంత్రులు అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు.

 మంత్రులు పదవులు కాపాడుకోవటం కోసం అడ్డ దారులు తొక్కే అవకాశం ఉంది

మంత్రులు పదవులు కాపాడుకోవటం కోసం అడ్డ దారులు తొక్కే అవకాశం ఉంది

ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులకు దిగారని విమర్శించారు. ఇక తమ పదవులను కాపాడుకోటానికి వైసీపీ నేతలు అడ్డదారులు తోక్కుతారని జాగ్రత్తగా నిఘా వెయ్యాలని, అవసరమైది వీడియోలు తియ్యాలని, ఎక్కడ డబ్బులు పంచినా వీడియోలు తీసి పంపాలని చెప్పారు. వైసీపీ ఉన్మాద చర్యలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

డబ్బు పంచితే వీడియోలు తియ్యండి .. ఫిర్యాదు చేద్దాం

డబ్బు పంచితే వీడియోలు తియ్యండి .. ఫిర్యాదు చేద్దాం

ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపాలని, మీడియాను సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన చంద్రబాబు యువ నాయకత్వం ముందుకు రావాలని చెప్పారు. స్థానిక నేతలుగా యువతను ప్రోత్సహించాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.ఇక రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు బీసీలకు తగ్గించి ద్రోహం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఒక్క నిర్ణయం అయినా సరైన నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    AP Local Body Polls : Watch TDP Leaders Met State Election Commissioner | Oneindia Telugu
    జగన్ వన్నీ నాటకాలు .. కుట్రలు , దోపిడీలు అన్న టీడీపీ అధినేత

    జగన్ వన్నీ నాటకాలు .. కుట్రలు , దోపిడీలు అన్న టీడీపీ అధినేత

    సీఏఏ, ఎన్పీఆర్‌పై జగన్నాటకాలు ఆడుతున్నారని విమర్శించిన చంద్రబాబు కేసులు పెట్టినా ఆడబిడ్డలు ధైర్యంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. అనురాధ ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అఘాయిత్యాలను ప్రశ్నిస్తోందని బెదిరిస్తున్నారన్నారు. అనురాధ పోరాటం అందరికీ స్ఫూర్తి కావాలని చెప్పుకొచ్చారు. అశోక్ గజపతిరాజు ఆస్తులపై కన్నేశారని, సింహాచల ఆలయ భూములు లాక్కోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడోపేడో తేల్చుకోవాలే తప్ప భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని , వైసీపీకి చావుదెబ్బ కొట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+