విజయసాయిని అరెస్ట్ చేయాలి: కలెక్టర్‌కు టీడీపీ, 'బాబూ! కేసీఆర్‌ని చూసి నేర్చుకో, మళ్లీ యూటర్న్ వద్దు'

Recommended Video

    మోడీది మేకపోతు గాంభీర్యం, విజయసాయి రెడ్డి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు

    అమరావతి: సీఎం చంద్రబాబుపై ఢిల్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్, విజయసాయిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    చదవండి: రాజ్యసభలో మోడీ ఫేర్‌వెల్ స్పీచ్: సీఎం రమేష్ రాజీనామా, ఇదీ కారణం

    వైసీపీ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నాపు, వారికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వైఖరి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతినేలా ఉందన్నారు.

    TDP complain against Vijaya Sai Reddy in Guntur

    మరోవైపు, ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గొంగళి పురుగును అయినా ముద్దుపెట్టుకుంటానని చెప్పిన కేసీఆర్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. యూటర్న్ అంకుల్ చంద్రబాబు నాలుగేళ్లు నిద్రపోయారని మండిపడ్డారు.

    అఖిల పక్ష సమావేశం విఫలపక్ష సమావేశం అయిందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించవద్దని చంద్రబాబుకు తాను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. హోదాపై చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకోవద్దన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+