వైసీపీ సమావేశాలు.. ఏమైనా జరగొచ్చు.. స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపైన టీడీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఓటర్ల తుది తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. మూడంచెల భద్రతతో పోలీసులు, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ లకు పహారా కాస్తున్నాయి.

స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపై టీడీపీ ఆందోళన
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల భద్రత పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలు స్ట్రాంగ్ రూముల వద్ద తిరుగుతూ ఉండడం, స్ట్రాంగ్ రూముల సమీపంలో సమావేశాలు పెట్టుకుంటూ ఉండడం, మారణాయుధాలతో సంచరిస్తూ ఉండడం వంటి ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంల భద్రతపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

TDP is worried about the security of strong rooms with ycp meetings and latest incidents

నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ధూళిపాళ్ళ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైన క్రమంలో తాము ఓడిపోతున్నామని క్లారిటీ ఉన్న కొందరు వైసీపీ నేతలు ఏమైనా చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి తాజాగా వెల్లడించారు. నిన్న నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయ్యారని ఆయన పేర్కొన్నారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద వైసీపీ నేతలు, సీఎం భద్రతా సిబ్బంది సమావేశం
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీఎం భద్రత సిబ్బంది భేటీ కావడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిద్ధం పోస్టర్ను కూడా ప్రదర్శించారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భేటీలో వైసిపి నేతలు కూడా పాల్గొన్నారని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతను మరింత పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ కుట్రలు చేసే చాన్స్
ఓడిపోతామని భయంతో ఉన్న వైసిపి వాళ్ళు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఫిర్యాదు చేశారు. నిన్నటికి నిన్న తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసిపి మూకలు రాడ్లు, బీరు బాటిల్స్, సుత్తులతో టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పైన దాడి చేసిన ఘటనతో చంద్రబాబు కూడా ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పెంచాలన్న చంద్రబాబు
స్ట్రాంగ్ రూముల సమీపంలో వైసిపి మూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. అంతేకాదు స్ట్రాంగ్ రూముల భద్రత పైన చంద్రబాబు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+