tdp-janasena: ఏపీ వ్యాప్తంగా టీడీపీ-జనసేన భేటీలు-సింగిల్ పాయింట్ అజెండా ?
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం నారా లోకేష్ తో కలిసి రాజమండ్రిలో ఇరు పార్టీల సమన్వయ కమిట భేటీ నిర్వహించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా నిన్నటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్ధాయిలో ఇరు పార్టీల సమన్వయ కమిటీల భేటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కూడా పలు జిల్లాల్లో భేటీలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన కలిసి పనిచేసేందుకు రాష్టస్ధాయిలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించన క్షేత్రస్ధాయి నేతలకూ ఈ విషయంలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేకుండా చూసేందుకు వీలుగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్ధాయిలో కలిసి పనిచేయాల్సిన నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఈ భేటీల్లో జరిగే చర్చలు ప్రాదాన్యం సంతరిచుకున్నాయి,

ఇవాళ ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లాలకు సంబంధించి విజయవాడ, ఏలూరులో జరుగుతన్న భేటీల్లో టీడీపీ, జనసేనకు చెందిన పలువురు ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించిన సమన్వయ కర్తలు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పొత్తును జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే ఏకైక అజెండాతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో స్ధానికంగా ఉన్న సమస్యలపై చర్చంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చే లోపు జిల్లా స్ధాయిలో టీడీపీ-జనసేన సమావేశాలు పూర్తి చేసుకుని, నవంబర్ 1న మినీ మ్యానిఫెస్టో ప్రకటించి ఇరు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. దీంతో రేపటి వరకూ ఈ భేటీల్లో స్ధానికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications