కరోనా వారియర్స్ ను తొలగిస్తారా ? ఇదేనా జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం : టీడీపీ నేత పట్టాభి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగించడం పై టిడిపి నేత పట్టాభి తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన కరోనా వారియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వారియర్స్ ను తొలగిస్తే బాధితులకు చికిత్స ఎవరు అందిస్తారన్న పట్టాభి

కరోనా వారియర్స్ ను తొలగిస్తే బాధితులకు చికిత్స ఎవరు అందిస్తారన్న పట్టాభి

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కరోనా వారియర్స్ ను తొలగిస్తే బాధితులకు చికిత్స ఎవరు అందిస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా వారియర్స్ కు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోగా, వారిని విధుల్లో నుంచి తొలగించడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదేనా వారికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఈ సమయంలో కూడా ప్రభుత్వం అలసత్వం వీడటంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరి ప్రాణాలు పోయినా సీఎం జగన్ దే బాధ్యత

ఎవరి ప్రాణాలు పోయినా సీఎం జగన్ దే బాధ్యత

వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని పట్టాభి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కరోనా విస్తరించినా, ఎవరి ప్రాణాలు పోయినా దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని టిడిపి నేత పట్టాభి డిమాండ్ చేశారు. కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పట్టాభి పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పూలాభిషేకాలు నిర్వహిస్తే ఏపీ సర్కార్ మాత్రం వారిపట్ల దారుణంగా వ్యవహరించటం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలని ప్రశ్నించారు .

 గుంటూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం

గుంటూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం

గుంటూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని పట్టాభి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జీతాలు ఇవ్వకుండా ఒక్క మెసేజ్ తో వారియర్స్ ను విధుల్లో నుంచి తొలగించారని దుయ్యబట్టారు. కరోనా వారియర్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని టిడిపి నేత పట్టాభి హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+