వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికలకు టీడీపీ దూరం ? మౌనంతో సంకేతం ? వైసీపీని ఒత్తిడిలోకి నెట్టే వ్యూహం !

|
Google Oneindia TeluguNews

వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో రాజకీయాలకు ఓ టర్నింగ్ పాయింట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే, విపక్ష కూటములు నిలబెట్టిన ఇద్దరు అభ్యర్ధులు ద్రౌపదీ ముర్ము, యశ్వంత్ సిన్హాల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు కచ్చితంగా ఇక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదికి వైసీపీ మద్దతు ప్రకటించగా.. టీడీపీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల పోరు

రాష్ట్రపతి ఎన్నికల పోరు

వచ్చే నెలలో జరిగే రాష్ట్గపతి ఎన్నికల కోసం ఎన్డీయే ద్రౌపది ముర్మును, విపక్షాలు ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. వీరిలో ఎన్డీయేకు తమ అభ్యర్ధి ముర్మూను గెలిపించుకునేంత మెజారిటీ ఇప్పటికే వచ్చేసింది. అయినా విపక్షాలు కూడా యశ్వంత్ సిన్హాకు పూర్తిగా మద్దతివ్వడం ద్వారా ముర్ముకు గట్టిపోటీ ఇప్పించాలనే పట్టుదలతో ఉన్నాయి. అప్పుడే మోడీ-షా దురహంకారానికి చెక్ పెట్టొచ్చని యోచిస్తున్నాయి. దీంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలో రాజకీయ పార్టీలు తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి.

ద్రౌపది ముర్మువైపే వైసీపీ

ద్రౌపది ముర్మువైపే వైసీపీ


ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంతోమూడేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఎన్డీయే తరఫున కేంద్రంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి వైసీపీ మద్దతు లేకపోయినా ద్రౌపదీ ముర్ము సునాయాసంగా గట్టెక్కే అవకాశముంది. అయితే ఎన్డీయేకు మద్దతివ్వకుండా దూరంగా ఉన్నా, విపక్షాలకు మద్దతిచ్చినా సీఎం జగన్ కేంద్రం ఆగ్రహానికి గురి కావడం ఖాయం. దీంతో ఎందుకొచ్చిన తంటా అని జగన్ ద్రౌపదీ ముర్ముకు మద్దతు ప్రకటించేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా విపక్ష టీడీపీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడు వైసీపీ ఎదురుచూస్తోంది.

టీడీపీ నిర్ణయంపై ఉత్కంఠ

టీడీపీ నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలో ఇన్నాళ్లూ కేంద్రానికి మద్దతివ్వడంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పోటాపోటీగా వ్యవహరించాయి. వ్యవసాయ చట్టాలైనా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా ఎన్డీయే అభ్యర్ధులకు బేషరతుగా మద్దతిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల్ని, విభజన హామీల్ని తాకట్టు పెట్టి మరీ ఎన్డీయే ముందు సాగిలపడయం ఎందుకన్న ప్రశ్నలు వినిపించినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీకి మూడేళ్లుగా నిరాశ ఎదురవుతూనే ఉంది. దీంతో ఈసారి టీడీపీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీడీపీ తీసుకునే నిర్ణయంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా భవిష్యత్తులో పరోక్షంగా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో టీడీపీ నిర్ణయం కోసం బీజేపీ కూడా ఎదురుచూస్తోంది.

టీడీపీ నిర్ణయం తటస్ధమేనా ?

టీడీపీ నిర్ణయం తటస్ధమేనా ?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇప్పటివరకూ బీజేపీ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేసిన టీడీపీ.. ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ ప్రకటించిన ద్రౌపదీ ముర్ముకు మద్దతివ్వకుండా తటస్ధంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎన్డీయేకు మద్దతివ్వకపోయినా విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వకుండా తటస్ధంగా ఉండిపోతే టీడీపీకి వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు. దీంతో ఆ దిశగా టీడీపీలో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

 వైసీపీని దోషిగా నిలబెట్టే ఛాన్స్ ?

వైసీపీని దోషిగా నిలబెట్టే ఛాన్స్ ?

ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్ధంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది కచ్చితంగా వైసీపీకి ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి విభజన హామీలన్నీ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బేషరతుగా ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ మద్దతిచ్చింది. దీంతో వైసీపీ తీరుపై విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ తటస్ధంగా ఉండటం ద్వారా కొంతలో కొంత మెరుగన్న సంకేతాలు పంపినట్లవుతుంది. అదే్ సమయంలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతిమంగా వైసీపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు టీడీపీకి మంచి ఛాన్స్ దొరికినట్లవుతుంది.

English summary
opposition tdp has been maintainig its silence on support to presidential election candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X