జగన్ రండి.. కావాల్సినన్ని గంటలిస్తాం..! బుచ్చయ్య ఆఫర్..!
ఏపీలో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 18న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభించేందుకు వీలుగా ఇవాళ గవర్నర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరు అంశం తెరపైకి వస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీకి వస్తే వైసీపీ విమర్శలకు సమాధానం ఇస్తామని సవాల్ కూడా విసిరారు. దీనికి కొనసాగింపుగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా ఇవాళ జగన్ కు మరో ఆఫర్ ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి రావాలని కోరారు. ప్రజల సమస్యలపై చర్చిద్దాం, మీకు కావాల్సినన్ని గంటలు మైక్ ఇస్తామని ఆయన జగన్ కు సూచించారు. బయట సాక్షి టీవీ, సాక్షి పేపర్లలో మాత్రమే ప్రచారం చేస్తున్నారని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించడానికి ముందుకు రావడం లేదన్నారు.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేస్తోందని ఏ రాష్ట్రంలో లేనన్ని పెన్షన్లు ఇస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 70 శాతం పైగా ఇప్పటికే నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని బుచ్చయ్య తెలిపారు. తప్పుడు ఆరోపణలు, గ్లోబెల్ ప్రచారాలు ఇకపై సాగవని అటువంటి ప్రచారం చేస్తే కఠినంగా ఎదురు నిలబడతామని హెచ్చరించారు.
మరోవైపు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి కోటలు కూలిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు త్వరలో తాళాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కులాల, మతాల ఆధారంగా విభజించి, బంధువులతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నింపి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే నిజమైన సామాజిక న్యాయం చేస్తుందని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ప్రతిపక్ష హోదా ఇస్తేనే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వస్తారని సజ్జల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 'రాజ్యాంగేతర శక్తి'గా వ్యవహరించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతి కేంద్రంగా మార్చారన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications