రైలు పట్టాలపై పడుకోబెడతా.. మీడియాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులకు ధమ్కీ ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా.. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు.. నాకు మీడియా అంటే లెక్కనే లేదు అంటూ మీడియా సాక్షిగా నోరు పారేసుకున్నారు. ఏపీలోని టిడిపి ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మీడియాపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు
ఇక ఈ వీడియోను చూపించి అధికార పార్టీ నేతల తీరు ఇలా ఉందని వైసీపీ టార్గెట్ చేస్తోంది. అసలు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏం మాట్లాడారు అంటే..అనంతపురం జిల్లా గుంతకల్లు టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఓ మీటింగ్లో మీడియా సాక్షిగా మీడియా మీదే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా అంటే తనకు లెక్క లేదని అన్ని చూసి వచ్చినోడిని అంటూ మాట్లాడారు.

ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా
తనపై ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ రెచ్చిపోయారు. తనపై వివాదాలు రాస్తే సహించేది లేదని తనదైన శైలిలో స్పందించారు. తాను ఏదైనా తప్పు చేస్తే రాయాలని ,ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తానంటూ హెచ్చరించారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నిరూపించకుంటే రైలు పట్టాలపై పడుకోబెడతా
భూ అక్రమాలు చేశానని చెబుతున్నారని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందని రాస్తున్నారని, కొంతమంది తనకు వ్యతిరేకంగా కావాలని పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ నిరూపించాలని, నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గుమ్మనూరు జయరాం మీడియాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వైసీపీ
ఇక గుమ్మనూరు జయరాం తాజాగా చేసిన వ్యాఖ్యల వీడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలను వైసీపీ టార్గెట్ చేస్తుంది. జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానని గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గమని ఇటువంటి వారినా ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నామంటూ వైసీపీ గుమ్మనూరు చేయడం వ్యాఖ్యలను టార్గెట్ చేస్తోంది.












Click it and Unblock the Notifications