టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం - బూమ్ రాంగ్..!!

టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం కొత్త వివాదానికి కారణమైంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బాధితులకు సత్వర న్యాయం పేరుతో చేసిన వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. జాతీయ రహదారి పై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని పాక్షికంగా కూల్చవేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార పార్టీలో వైరల్ గా మారుతోంది.

ఎమ్మెల్యే తీరుతో
తిరువూరు ఎమ్మెల్యే ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కంభంపాడు లో ఉన్నటువంటి వైపాక చెందిన ఎంపీపీ కాలసాని చెన్నారావు భవనాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తమ స్థలాలను ఆక్రమించి అందులో భవంతి కడుతున్నారని కుంభపాడుకు చెందిన కొంతమంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అయితే అది అక్రమంగా నిర్మించాలనుకున్న ఆయన వాటిని తొలగించే బాధ్యతలను తానే తీసుకున్నారు.

TDP MLA Kolikapudi Srinivasa rao demolishes YCP Leader Construction leads to new controversy

అధికారులు చెప్పినా
బాధితులకు ఆ స్థలాన్ని వారికి అప్పగించాలని భావించారు. అధికారులు తొలగించకపోతే తానే తొలగిస్తామంటూ ఫేస్ బక్ లో పోస్టింగ్ పెట్టారు. దీంతో హంగామా మొదలైంది. మంగళవారం ఉదయమే టిడిపి జనసేన కార్యకర్తలతో పాటు బుల్డోజర్ తో భవనం వద్దకు చేరుకొనన్నారు. వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో, భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు ఆక్రమణ తొలిగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి కూర్చున్నారు. కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

రాజకీయ వివాదం
కూల్చటం కూల్చవద్దని..సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలిగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్లారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పొక్లెయిన్ సిబ్బంది డాబా దిగువ గది ఒక వైపు పాక్షికంగా కూల్చేసారు. ఆక్రమణను నిర్దారించి చర్యలు తీసుకుంటామని..అప్పటి వరకు ఆ స్థలం లోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయటంతో కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు. తాము ఎవరి స్థలమూ ఆక్రమించలేదని..అక్రమంగా నిర్మించటం లేదని వైసీపీ ఎంపీపీ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే హడావుడి, అత్యుత్సాహం దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత దారి తీయటం రాజకీయంగా వివాదానికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+