లాక్ డౌన్ కొనసాగింపుపై టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం- జగన్ ముందు డిమాండ్లు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా అదుపులోకి వచ్చిందని వైసీపీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను రెడ్ జోన్లకు పరిమితం చేయాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న ప్రధాని మోడీని కోరారు. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్ డౌన్ పొడిగించాలని భావిస్తున్న విపక్ష టీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు ఓ తీర్మానం చేసింది. ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానం చేసింది.

టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ...

ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన పరిస్దితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించిన పొలిట్ బ్యూరో.. లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకూ కొనసాగిస్తేనే మంచిదని భావించింది. ఈ మేరకు ప్రభుత్వాన్నికోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కరోనా నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు తగినన్ని పీపీఈలను పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

tdp political bureau resolution in a support to extend lock down till april 30th

ఉపాధి కూలీలకు ప్యాకేజీ డిమాండ్..

ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న కార్మికులు, ఉపాధి కూలీలకు 5 వేల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న టీడీపీ ఈ మేరకు పొలిట్ బ్యూరోలోనూ ఇదే డిమాండ్ ను తెలుగు ప్రభుత్వాల ముందుంచింది. దీంతో పాటు కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం అందించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసింది.
రైతులు, సెలూన్లు, నీటి బిల్లులు, కరెంటు బిల్లులను కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+