Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలోనూ టీడీపీ కృష్ణార్పణం: మాలోకం, జెండా పీకేసే ముందు ఎమోషన్స్ మామూలే: సాయిరెడ్డి సెటైర్లు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ,నారా లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక పక్క రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతుండగా, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారసమయంలో విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . చంద్రం కు ఇక నిరాశానిస్పృహలే మిగిలాయని, జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ కామనే మాలోకం అంటూ చంద్రబాబును , లోకేష్ ను టార్గెట్ చేశారు.

చంద్రం కు ఇక నిరాశా నిస్పృహనే

చంద్రం కు ఇక నిరాశా నిస్పృహనే

టిఆర్ఎస్ లో తెలంగాణ టీడీపీ విలీనం అయిందని, టీడిఎల్పి ని మూసేశారు అని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. లేకపోతే కృష్ణార్పణమో , గోదావరి లో నిమజ్జనం చేయడమో చేయాలని విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రం కు ఇక నిరాశా నిస్పృహనే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చిన్న మెదడు డ్యామేజ్ అయిన వాడివి, ఏదైనా అంటావు .. లోకేష్ పై వ్యంగ్యాలు

చిన్న మెదడు డ్యామేజ్ అయిన వాడివి, ఏదైనా అంటావు .. లోకేష్ పై వ్యంగ్యాలు

చంద్రబాబు చాలా రాష్ట్రాలకు డబ్బుమూటలు పంపించాడని అవి ఏమైనట్టు చెప్పాలని చంద్రబాబును విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. నారా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఇప్పటివరకు జగన్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ బాబును, కుల మీడియా ను అడుగు మాలోకం అంటూ లోకేష్ పై విరుచుకుపడ్డారు. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా .. చిన్న మెదడు డ్యామేజ్ అయిన వాడివి, ఏదైనా అంటావు అంటూ పేర్కొన్నారు. కర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టీకి నువ్వో 'పేద్ద' నాయకుడివి అంటూ విమర్శించారు .

జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే

జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే

జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే అంటూ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక నిన్న రాత్రి సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు . కట్ చేస్తే ప్రజాకోర్టులో నిన్ను ఘోరంగా బహిష్కరించారు అంటూ చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టే నీ పరాజయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయ గలదు కానీ నిన్ను గెలిపించ లేదు రాజా అంటూ సైరా పంచ్ వేశారు.

తండ్రీ , కొడుకులను టార్గెట్ చేసిన సాయి రెడ్డి

తండ్రీ , కొడుకులను టార్గెట్ చేసిన సాయి రెడ్డి

చంద్రబాబు, లోకేష్ తండ్రి, కొడుకులను టార్గెట్ చేస్తూ ,తెలుగుదేశం పార్టీ జెండా పీకేసే రోజు వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు.తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్న లోకేష్ జగన్ ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు . ఉద్యోగాలపై , రాష్ట్రంలో ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పాలనలో సాగుతున్న అరాచకాలను ఎండగడుతూ పదునైన విమర్శలతో దూసుకుపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+