AP Schools Bandh : ఏపీలో రేపు స్కూళ్లు, కాలేజీల బంద్-కారణమిదే..!
ఏపీలో పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలు రేపు ఒక్కరోజు మూతపడబోతున్నాయి. ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాల కారణంగా విద్యార్ధులకు జరుగుతున్న నష్టానికి నిరసనగా తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య ఇచ్చిన పిలుపుమేరకు రేపు(మంగళవారం) ఒక్కరోజు విద్యాసంస్ధలు మూతపడనున్నాయి. ఈ మేరకు టీఎస్ఎస్ఎఫ్ విద్యాసంస్ధల యాజమాన్యాలు, అధికారులకు సమాచారం ఇచ్చింది.
ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 77ను రద్దు చేయాలని, ప్రతివిద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వా లని, మెగా డీఎస్సీ నిర్వహించాలని టీఎన్ఎస్ఎఫ్ కోరుతోంది. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని, సంక్షేమ హాస్టళ్లు ఆధునీకరించాలని, విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని కోరుతోంది. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణ తరహాలో మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదే కోవలో మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి.

ప్రతీ ఏటా రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆరంభంలో విద్యార్ధి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇలా బంద్ లు నిర్పహించడం సాధారణమే. ఈ నెల ఆరంభంలోనూ ఓసారి ఇలాంటి బంద్ జరిగింది. ఇప్పుడు మరోసారి రేపు టీఎన్ఎస్ఎఫ్ పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో విద్యాసంస్ధలకు ముందుగానే సమాచారం ఇవ్వడం, వారు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వచ్చందంగా సెలవులు ప్రకటించడం జరుగుతోంది.
ఏపీలో ఇప్పటికే కొన్ని రోజులుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యార్ధులు పాఠశాలలకు రావడం లేదు. మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా పాఠశాలలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంద్ కారణంగా రేపు ఒక్కరోజు స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. ఈ మేరకు పాఠశాలల్ని, కళాశాలల్ని పూర్తిస్ధాయిలో మూయించేందుకు టీఎన్ఎస్ఎఫ్
ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications