విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాన్సాస్ ఛైర్మన్ గా అశోక్ ను తప్పించడం వెనుక 13 వేల ఎకరాల భూకబ్జా కుట్ర : టీడీపీ

|
Google Oneindia TeluguNews

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్నకూతురు సంచైతా గజపతిరాజును నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపించింది. ట్రస్టుకు చెందిన 13 వేల ఎకరాల భూముల కబ్జాకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు.

మాన్సాస్ నుంచి అశోక్ ను తప్పించడం వెనుక కుట్ర

మాన్సాస్ నుంచి అశోక్ ను తప్పించడం వెనుక కుట్ర

విజయనగరం రాజకుటుంబ నిర్వహణలోని మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన 13వేల ఎకరాల భూమిని కాజేయడానికి జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విపక్ష టీడీపీ ఆరోపించింది.
అందుకే వంశపారంపర్య ధర్మకర్తనుకాదని, అశోక్ అన్న కూతురు సంచైతాను తెరపైకి తెచ్చారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా తొలుత అశోక్ గజపతిరాజుని నియమించి, మరో జీవోతో సంచితకు బాధ్యతలు అప్పగించడం వెనకున్న మర్మమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలకనేత రాజకుటుంబం వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడని ప్రశ్నించారు.·

 అశోక్ పై కక్షతోనే తొలగింపు

అశోక్ పై కక్షతోనే తొలగింపు


నీతి, నిజాయితీకి మారుపేరైన అశోక్ గజపతిరాజుపై ఉన్న కక్షతోనే జగన్ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని కళా వెంకట్రావు విమర్శించారు
. హిందూమత విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలు కూడా జగన్ చేస్తున్నాడని కళా అరోపించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలదేవస్థానం అధీనంలో ఉన్న భూములుకూడా ఎంపీ విజయసాయి రెడ్డి భూదోపిడీ జాబితాలో చేరబోతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష, విజయసాయి ధనదాహం వల్లే రాష్ట్ర ప్రభుత్వం
ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో వేలుపెట్టిందని
కళా ఆరోపించారు.

భూములు కాజేసేందుకేనన్న కాల్వ

భూములు కాజేసేందుకేనన్న కాల్వ

రాజకుటుంబం వ్యవహారాల్లో వేలుపెట్టి, లక్షలకోట్ల విలువైన ఆస్తులను కొట్టేయాలన్న ఆలోచన ఉండబట్టే, 20రోజుల వ్యవధిలోనే దేవస్థానం మెంబర్ గా ఉన్న సంచితను ఛైర్మన్ గా నియమించడం జరిగిందని మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ ప్రభుత్వం కావాలనే ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజుల కుటుంబాన్ని విచ్ఛిన్నంచేయాలన్న దుర్భుద్ధి జగన్ ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వం జారీచేసిన జీవో చూస్తే ఆ విషయం బోధపడుతోందన్నారు. ఒడిస్సాలోని రాజులుకూడా సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చారని, హిందూ మత విశ్వాసాలపై జగన్ ఎందుకు దాడిచేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు.

అశోక్ గజపతిరాజు మీదున్న కక్షతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని కాల్వ విమర్శించారు.

Recommended Video

బాబు ఒక చచ్చిన పాము: కృష్ణంరాజు | Krishnam Raju Sensational Comments On Chandrababu Naidu & YS Jagan
 మాన్సాస్ భూముల కోసమేనన్న కాల్వ

మాన్సాస్ భూముల కోసమేనన్న కాల్వ

లక్షలకోట్ల విలుచేసే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న దుర్భుద్ధితోనే అశోక్ గజపతిరాజు కుటుంబ వ్యవహారం లో వేలుపెట్టిందని టీడీపీ నేత కాల్వ ఆరోపించారు. 1958లో పీ.వీ.జీ రాజు ట్రస్ట్ ను ఏర్పాటుచేసినప్పుడే తన తదనంతరం ఎవరు ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఎవరైతే కుటుంబానికి వారసుడిగా ఉంటాడో, అతనే ట్రస్ట్ కు ఛైర్మన్ గా ఉంటాడని నిబంధనల్లో పేర్కొనడం జరిగిందని, దానిప్రకారమే 16ఏళ్లపాటు, ఆనంద గజపతి రాజే ట్రస్ట్ కు ఛైర్మన్ గా వ్యవహరించారని కాలవ తెలిపారు. ఆనంద గజపతి రాజు మరణించాకే, అశోక్ గజపతిరాజు 2016నుంచి ట్రస్ట్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారని, నీతికి, నిజాయితీకి ప్రతిరూపంగా విధులు నిర్వహిస్తున్నారని శ్రీనివాసులు స్పష్టంచేశారు. అటువంటి వ్యక్తిపై జగన్మోహన్ రెడ్డి, కక్షసాధింపులకు పాల్పడం చూస్తుంటే, ముఖ్యమంత్రి ఎంతటి విషపు ఆలోచనలు చేస్తున్నాడో అర్థమవుతోందన్నారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం అశోక్ గజపతిరాజు ఆధీనంలో ఉన్నాయన్నఅక్కసుతోనే, జగన్ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా రాజకుటుంబ వ్యవహారాల్లో చొరబడిందన్నారు. 20-02-2020న జీవో నెం-252 విడుదలచేసిన జగన్ ప్రభుత్వం, సింహాచలం ఆలయట్రస్ట్ బోర్డుని 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ జీవో ప్రకారం అశోక్ గజపతిరాజుని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా పేర్కొని, సంచితను 16మందిలో ఒక మెంబర్ గా నియమించిందన్నారు. 29వ తేదీన జరగాల్సిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి3వతేదీకి వాయిదాపడటంతో, ఉన్నపళంగా సంచిత ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగిందన్నారు. అధికారికంగా అందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ బయటపెట్టకుండా, ట్రస్ట్ వ్యవస్థాపకులైన పీ.వీ.జీ రాజు నిబంధనల్లో వారసుడు అనిచెప్పినప్పటికీ దాన్నికాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష, విజయసాయిరెడ్డి ధనదాహం వల్లనే ట్రస్ట్ వ్యవహరాల్లో ప్రభుత్వం వేలుపెట్టిందన్నారు.

విశాఖ కేంద్రంగా విజయసాయి సాగిస్తున్న భూదందాలు రోజుకొకటిగా బయటకు వస్తున్నాయని, అవేవీ చాలవన్నట్లుగా మాన్సాస్ ట్రస్ట్ ను, సింహాచల దేవస్థాన భూములను కాజేయాలన్న దురాలోచనతోనే, సంచితను తెరపైకి తీసుకురావడం జరిగిందన్నారు. సేవాభావంతో నడుస్తున్న ట్రస్ట్ ఆస్తులను, పవిత్రమైన దేవస్థాన ఆస్తులను కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకుంటే, ఉత్తరాంధ్రవాసులే జగన్ కు తగిన విధంగా బుద్ధి చెబుతారని కాలవ హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న 13వేల ఎకరాలతోపాటు, ఉత్తరాంధ్రలో ఉన్న లక్షలఎకరాలను కాజేయాలన్న ఆలోచన విజయసాయికి ఉండబట్టే, ట్రస్ట్ వ్యవహారాల్లో వేలుపెట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. తనకే మాత్రం అనుభవంలేని సంచిత, ట్రస్ట్ ను నిర్వహించడం సాధ్యంకాదని, ఆ విషయం తెలిసే, ప్రభుత్వం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, అశోక్ గజపతిరాజుని పక్కనపెట్టిందన్నారు. హిందూమత విశ్వాసాల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం, సింహాచల దేవస్థాన ట్రస్ట్ బోర్డు విషయంలో చట్టవిరుద్ధంగా తలదూర్చిందన్నారు.

English summary
Tdp alleges that Big Conspiracy of Land grabbing is behind former union minister Ashok Gajapathi Raju's Removal from MANSAS Trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X