వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్ల పరిస్థితి ధైర్యంగా మరి వాహనచోదకులకు చుక్కలు చూపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో టిడిపి ఆందోళనలో భాగంగా చెరువులుగా మారిన రోడ్లపై నాట్లు వేస్తూ, వలలతో చేపలు పడుతూ టిడిపి నేతలు నిరసన తెలియజేస్తున్నారు. టిడిపి నేతలు జగనన్న గుంతల పథకం అంటూ రాష్ట్రంలోని రోడ్లపై సెటైర్లు వేస్తున్నారు.

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని

దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం బాపిరాజు గూడెం లో రహదారులపై ఉన్న గోతులను శనివారం తన అనుచరులతో కలిసి పూడ్చారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏలూరు చింతలపూడి రోడ్డు లోని బాపిరాజు గూడెం పరిధిలో రామచంద్రాపురం లో గోతులు పూడ్చే చర్యలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు.

అనుమతులు లేవంటూ అడ్డుకున్న పోలీసులు .. జగన్ సర్కార్ పై చింతమనేని ఫైర్

అనుమతులు లేవంటూ అడ్డుకున్న పోలీసులు .. జగన్ సర్కార్ పై చింతమనేని ఫైర్


రహదారులకు స్వచ్ఛందంగా మరమ్మతు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని అడ్డుకున్న పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగారు. గోతులు పూడ్చడానికి అనుమతులు లేవంటూ చింతమనేని ప్రభాకర్ ను అడ్డుకున్నారు. దీనిపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై వాహనచోదకులు ప్రయాణం చేసే పరిస్థితి లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై గోతులు ప్రాణాంతకంగా మారుతున్నాయి అని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాణాలను చేతబట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది

వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది


రహదారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని, దానిని మేల్కొల్పడం కోసమే రహదారులపై గోతులు పూడ్చే చర్యలు చేపట్టినట్లుగా చింతమనేని ప్రభాకర్ చెప్పారు. రామచంద్రపురంలో గోతులను పూడ్చడంతో పాటుగా, కొయ్యలగూడెంలో జరిగే ఆందోళన కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.ఇక కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని అల్లూరు గ్రామంలో రహదారుల పరిస్థితి పై టిడిపి నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు, టిడిపి విజయవాడ పార్లమెంటరీ ఇంచార్జి నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో టీడీపీ ఆందోళన .. వైసీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్తత .. టీడీపీ నేతల అరెస్ట్

కృష్ణా జిల్లాలో టీడీపీ ఆందోళన .. వైసీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్తత .. టీడీపీ నేతల అరెస్ట్

అయితే రహదారుల దుస్థితిపై ఆందోళనలో భాగంగా వచ్చిన టిడిపి నాయకులనుఅడ్డుకోవడానికి వైసిపి కార్యకర్తలు తరలిరావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఇరువర్గాల వారు హోరా హోరీ గా నినాదాలు చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు,టిడిపి నేతలను అరెస్టు చేశారు. వారిని చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని, వైసిపి నాయకులు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.

English summary
TDP leaders have staged protest against the worst condition of roads in AP. Chintamaneni Prabhakar, a former MLA from Dendulur constituency, expressed his displeasure over the derelict roads. Prabhakar, a former MLA, tried to fill the potholes with mud, and police stopped him in Bapiraju Goodam in Pedavegi zone. Police arrested Devineni Uma and Gadde Rammohan for portesting about road condition in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X