జగన్ బెంగళూరు మకాం సీక్రెట్ అదేనా ? సూపర్ రిచ్ క్లబ్ లో- యనమల షాకింగ్..!
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా బెంగళూరు నివాసంలోనే మకాం వేస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ తాడేపల్లి కంటే బెంగళూరులోనే ఎందుకు మకాం వేస్తున్నారో ఆయన ఇవాళ బయటపెట్టారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే చేసేవారని యనమల తెలిపారు. అందుకే ఇప్పుడు దీనిపై అనుమానాలు వస్తున్నాయన్నారు.
బెంగళూరులోనే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని యనమల రామకృష్ణుడు తెలిపారు. తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్ కు తరలించారన్నారు. బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని, సొంత నియోజకవర్గం కానే కాదని గుర్తుచేశారు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదని, కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదన్నారు. అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఎందుకు మకాం వేస్తున్నారని ప్రశ్నించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారన్నారు నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు. ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్ సహా వివిధ వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర పెరిగాయన్నారు. అవినీతి కారణంగానే ఆస్తులు అమాంతం పెరిగిపోయాయన్నారు.
జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదతోనే జగన్ సహా వివిధ కీలక నేతల ఆస్తులు 600 శాతం మేర పెరిగాయని తెలిపారు. బడుగులను అణగదొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని యనమల ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటివి జగన్ అవినీతి పుత్రికలే అన్నారు.












Click it and Unblock the Notifications