ఏపీ కోసం.. జేసీ ట్విస్ట్: కేవీపీ హోదా బిల్లుకు బాబు మద్దతు!
విజయవాడ/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లుకు మద్దతు పలకాలని టిడిపి నిర్ణయించిందని తెలుస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు హోదా ఇవ్వాలని గత పార్లమెంటు సమావేశాల్లో కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ సమావేశంలో బిల్లుకు మద్దతు పలకాలని టిడిపి నిర్ణయించిందని తెలుస్తోంది.

కేవీపీ రామచంద్ర రావు గతంలో ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
హోదా రాదు: బాబుకు కేవీపీ లేఖ, 'అమరావతి టు కౌలాలంపూర్ విమానం'కాగా, దీనిపై టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ బిల్లుకు టిడిపి మద్దతిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా పని చేస్తుందని చెప్పారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా సాధిస్తామని జేసీ చెప్పారు.












Click it and Unblock the Notifications