• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ఆ సిట్టింగ్ ఎంపీల ప‌రిస్థితి అదోగ‌తే..! కొత్త ముఖాల కోసం అదిష్టానం ప్ర‌య‌త్నాలు..!!

|

హైద‌రాబాద్ : ఏపి రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అదికార టీడిపి లో రాజ‌కీయ వ‌డ‌పోత కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్న‌ట్టు స‌మాచారం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో స‌మూల మార్పులు చేయాల‌ని అదికార పార్టీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకోసం సిట్టింగుల ప‌ట్ల క‌నిక‌రం లేకుండా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది టీడిపి అదిష్టానం నిర్ణ‌యంగా తెలుస్తోంది. చాలా మంది బ‌ల‌హీనంగా ఉన్న సిట్టింగ్ ఎంపిల స్థానాల్లో కొత్త వారికి అవ‌కాశం ఇచ్చేందుకు అదికార పార్టీ సన్నాహాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏపీ రాజ‌కీయ‌ల్లో కీలక మార్పులు..! భారీ వ‌డ‌పోత కు అదికార పార్టీ శ్రీ‌కారం..!

ఏపీ రాజ‌కీయ‌ల్లో కీలక మార్పులు..! భారీ వ‌డ‌పోత కు అదికార పార్టీ శ్రీ‌కారం..!

ఏపీలో సిట్టింగ్ ఎంపీల్లో కొంద‌రు 2019లో పోటీపై విముఖ‌త వ్య‌క్తంచేస్తుంటే.. ఇంకొంద‌రు సీటు ద‌క్కించుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. తండ్రి మ‌ర‌ణంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు ఈ ద‌ఫా త‌న బార్య‌ను ఎంఎల్ ఏ చేయాల‌నుకుంటున్నాడు. ఇక కీల‌క‌మైన టీడీపీ ఎంపీలు మాగంటి ముర‌ళీమోహ‌న్ వ‌యో బారాన్ని చూపుతూ రాజ‌కీయాల‌కు దూరంగా కాబోతున్నారు. ఇంటిప‌ట్టునే ఉండి సేవా, రాజ‌కీయ కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. అందుకే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కోడ‌లు సీటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌మండ్రి ఎంపీ కార్యాల‌యంలో ఆమె అన్నీ తానై చ‌క్రం తిప్పుతోంది. ముర‌ళీమోహ‌న్ స్తానికంగా ఉండ‌టం లేద‌నే వ్య‌తిరేక‌త ఉంది. ఈ ద‌ఫా ఎంపీగా ఆయ‌న నియోజ‌క‌ర్గానికి చేసింది కూడా పెద్ద‌గా ఏమిలేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

 చిన్న పొర‌పాటు పెద్ద‌మూల్యం..! త‌ప్పు చేయ‌కూడ‌ద‌నుకుంటున్న టీడిపి..!!

చిన్న పొర‌పాటు పెద్ద‌మూల్యం..! త‌ప్పు చేయ‌కూడ‌ద‌నుకుంటున్న టీడిపి..!!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని మొద‌టి నుంచి వివాదాస్ప‌దంగా ఉన్నారు. ఆర్‌టీఏ ఆఫీసులో గొడ‌వ‌.. అదికారుల‌పై చేయి చేసుకోవ‌టం.. లోక‌ల్ నేత‌ల‌తో స‌రిగా మెల‌గ‌క‌పోవ‌టం.. ట్రావెల్స్‌పై ఆరోప‌ణ‌లు ఇవ‌న్నీ అడ్డుగోడ‌లుగా మారాయి. పైగా క‌న‌క‌దుర్గ అమ్మవారి గుడి వ‌ద్ద త‌ల‌పెట్టిన ఫ్లై ఓవ‌ర్ మూడేళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. ఈ ద‌ఫా ఇక్క‌డ నుంచి నంద‌మూరి వార‌సురాలు నారా బ్రాహ్మ‌ణిని రంగంలోకి దింపుతార‌నే ప్రచారం ఉంది. ఇది గాక‌పోతే.. దేవినేని నెహ్రు త‌న‌యుడు అవినాష్‌ను పోటీకు నిల‌పాల‌నే ఆలోచ‌న కూడా టీడీపీ శ్రేణుల్లో ఉన్న‌ట్టు స‌మాచారం.

 ఎక్కువ ఎంపీ స్థానాల గెలుపే టీడిపి ల‌క్ష్యం..! అందుకే తీవ్ర వ‌డ‌పోత‌..!!

ఎక్కువ ఎంపీ స్థానాల గెలుపే టీడిపి ల‌క్ష్యం..! అందుకే తీవ్ర వ‌డ‌పోత‌..!!

గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా పార్టీతో అంటీముట్ట‌న‌ట్టున్నారు. లోక‌ల్‌గా కూడా వ్య‌తిరేక‌త‌ను కొని తెచ్చుకున్నారు. ఈ ద‌ఫా గ‌ల్లా బ‌రిలోకి దిగితే పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి ఎంత వ‌ర‌కూ స‌హ‌కారం ఉంటుందనేది అనుమాన‌మే. న‌ర్స‌రావుపేట నుంచి గెలిచిన రాయ‌పాటి సాంబశివ‌రావు గుంటూరు రావాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. వీలుకాకుంటే.. త‌న కుమారుడిని పోటీకి నిల‌పాల‌నుకుంటున్నారు. అయితే పార్టీ రాయ‌పాటి విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డింది టీడిపి అదిష్టానం.

 ప్ర‌జా జీవితంలో లేని ప్రముఖుల‌కు ఈ సారి అవ‌కాశం లేన‌ట్టే..!

ప్ర‌జా జీవితంలో లేని ప్రముఖుల‌కు ఈ సారి అవ‌కాశం లేన‌ట్టే..!

క‌ర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా.. టీడీపీ నుంచి ఆమెకే అవ‌కాశం అంటూ ఈ మ‌ద్య లోకేష్ ప్ర‌క‌టించాడు. అయితే.. అది చివ‌రి వర‌కూ ఉంటుందా అనేది అనుమాన‌మే. అనంత‌పురం ఎంపీ సీటుపై ప‌రిటాల వార‌సుడు శ్రీరామ్ ఆశ‌ప‌డుతున్నాడు. సిట్టింగ్ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి కూడా త‌న వారుసుడి ప‌వ‌న్ కోసం ఆ సీటు కావాలంటున్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ వైవి.సుబ్బారెడ్డి ఈ సారి పోటీ అనుమాన‌మే అంటున్నారు. ఇక్క‌డ నుంచి క‌ర‌ణం బ‌ల‌రాం ఎంపీగా త‌న అద్రుష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌నుకుంటున్నార‌ట‌. హిందూపూర్ నిమ్మ‌ల కిష్ట‌ప్ప కూడా త‌న‌కు ఈ ద‌ఫా ఎమ్మెల్యే సీటు కావాల‌ని కోరుతున్న‌ట్టు తెలుస్తొంది.

 ఎక్కువ ఎంపీ స్థానాలే టీడిపి ల‌క్ష్యం..! గెలుపు గుర్రాల‌పైనే ఫోక‌స్..!!

ఎక్కువ ఎంపీ స్థానాలే టీడిపి ల‌క్ష్యం..! గెలుపు గుర్రాల‌పైనే ఫోక‌స్..!!

చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌పై అదినేత చంద్ర‌బాబు గుర్రుగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న టీడీపీ వైఖ‌రిపై బ‌హిరంగ కామెంట్స్ చేశాడు. పైగా ప్ర‌స్తుతం అక్క‌డ పార్టీ వ్య‌తిరేక‌త ఉంది. జ‌న‌సేన కూడా పోటీలో ఉండ‌టంతో.. కొత్త అభ్య‌ర్తి కోసం పార్టీ అదిష్టానం ఇప్ప‌టికే వెతుకులాట‌లో ఉంద‌ట‌. 2019 ఎన్నిక‌ల్లో ఎంపీ సీట్ల‌పై గంపెడా శ‌లు పెట్టుకున్న చంద్ర‌బాబు.. అంగ‌బ‌లం.. అర్ద‌బ‌లం ఉన్న‌వారికే ఇంపార్టెన్స్ ఇస్తార‌నేది బ‌ట్ట‌బ‌య‌లైంది. దీంతో ఎవ‌రికి వారు త‌మ బ‌లాబ‌లాల‌ను చాటుకునేందుకు.. బాబు చుట్టూ.. కుద‌ర‌క‌పోతే.. త‌న‌యుడు లోకేష‌బాబు ద్వారా పైర‌వీలు చేయించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఈ లెక్క‌న‌.. సీనియ‌ర్లంతా. వార‌సుల‌ను ఎన్నిక‌ల్లో దింపి.. వార‌సత్వాన్ని కాపాడుకోవాల‌ని ప‌డుతున్న ఆశ ఎంత‌వ‌ర‌కూ తీరుతుందో చూడాల్సిందే!

English summary
There seems to be a big change in the ap politics. Information about the political filming program is being set up in the fiery TDP. The party looks forward to making changes in the face of the general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X