గోవిందకోటి రాసిన వారికి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం; నేడు తిరుమల రద్దీ ఇలా!!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అటువంటి వారికి టీటీడీ దర్శనానికి సంబంధించి, తిరుమలలో పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అంతేకాదు తిరుమల శ్రీవారికి సంబంధించిన వివిధ అంశాలపై టిటిడి ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా తిరుమలలో స్వామివారి బ్రేక్ దర్శనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని టిటిడి ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

25 సంవత్సరాల లోపు వారు "గోవింద కోటి" పదిలక్షల 116 సార్లు రాస్తే వారికి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Tirumala Break darshan for those who wrote Govindakoti; Tirumala latest news!!

అంతేకాదు తిరుమల కొండపై వసతి గతులకు సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నవారికే కొండపై వసతి గదులు కల్పిస్తుంది. దీంతో భక్తుల రద్దీని దీని కొంతమేర తగ్గించవచ్చని టిటిడి భావిస్తుంది.

ప్రస్తుతం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. నిన్న ఒక్కరోజు తిరుమల శ్రీవారిని 54 వేల 105 మంది దర్శనం చేసుకోగా, తలనీలాలు సమర్పించిన భక్తులు 23,590 మంది ఉన్నారని టిడిపి పేర్కొంది. హుండీ ఆదాయం 3.44 కోట్లు వచ్చాయని, సర్వదర్శనానికి నిన్న సుమారు 24 గంటల సమయం పట్టిందని టిటిడి తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.

ఇదిలా ఉంటే నిన్న రాత్రి వైభవంగా తిరుమల స్వామి వారి పుష్య మాస పౌర్ణమి గరుడసేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు విశేష సంఖ్యలో కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+