రైతు వద్ద కిలో రూ.3, హేరిటేజ్‌లో కిలో రూ.50, ఇదేమిటి? :టమాటపై జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: రైతుల నుండి కిలో టమాటను రూ.3 కొనుగోలు చేసి హెరిటేజ్ షాపుల్లో మాత్రం కిలో టమాటాలను రూ.50లకు విక్రయిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. రైతు పండించిన ధరలకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మండలానికో టమాట జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానని జగన్ హమీ ఇచ్చారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని ఎర్రసానిపల్లి వద్ద టమాట రైతులతో మాట్లాడారు. టమాట పొలాన్ని పరిశీలించారు.

ఎందుకు ఓడించామా అని ఓట్లరు బాధపడాలి, కోడి పందెలను జూదంగా మార్చొద్దు: బాబు

టమాట రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకొన్నారు. ఏం చేస్తే ప్రయోజనమనే విషయాలపై రైతులతో జగన్ చర్చించారు. తమ ప్రభుత్వం వస్తే రైతులకు చేపట్టనున్న పథకాలను జగన్ రైతులకు వివరించారు.

హెరిటేజ్‌లో కిలో రూ.50, రైతుకు రూ.3

హెరిటేజ్‌లో కిలో రూ.50, రైతుకు రూ.3

రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. టమాట రైతుకు పెట్టుబడి కూడ రావడం లేదని రైతులు జగన్ కు చెప్పారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పుల పాలౌతున్నామని రైతులు చెప్పారు. రైతుల వద్ద కిలో టమాటను రూ.3లకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు., హెరిటేజ్ షాపుల్లో మాత్రం కిలో రూ.50 లకు విక్రయిస్తున్నారని జగన్ విమర్శించారు.

మండలానికో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా

మండలానికో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా

టమాట రైతుల కోసం మండలానికో జ్యూస్ ఫ్యాక్టరీని, కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు.రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులందరినీ ఆదుకుంటామని జగన్ చెప్పారు.

రూ.3 వేల కోట్లతో థరల స్థిరీకరణ నిధి

రూ.3 వేల కోట్లతో థరల స్థిరీకరణ నిధి

రైతుల సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే రూ.3 వేలకోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.రైతాంగం సంక్షేమం కోసం ఈ నిధిని ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. టమాట రైతుల కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై కూడ ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించనున్నట్టు చెప్పారు. రైతుకు పంటకు పెట్టుబడి కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని జగన్‌కు రైతులు వివరించారు. ధరలు లేని సమయంలో పంటను నిల్వ చేసుకొనే సదుపాయం లేకపోవడంతో రైతులు అనివార్యంగా పంటను విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలను స్టోరేజీ చేసుకొనే ఏర్పాటును కల్పిస్తామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will be establish Rs.3000 crores fund for farmers in ysrcp government said Ysrcp chief Ys Jagan. Ys Jagan assured to tomoto farmers on Sunday.He was visited tomato fields.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి