శిల్పారామంలో విషాదం: ఫన్‌రైడ్‌లో క్రాస్‌వీల్ విరిగిపడి మహిళ మృతి
తిరుపతి: తిరుచానూరు పరిధిలోని శిల్పారామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫన్‌రైడ్ క్రాస్వీల్లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా విరిగిపోయి కుప్పకూలింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన మహిళ సుబ్బారెడ్డి నగర్‍కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది ఇలావుండగా, కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్లు వద్ద రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం ఉరుకుంద ఈరన్న దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటకవాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలోని రాములమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంజి అనే వ్యక్తి తన స్నేహితులు నరసింహ, సాయితేజతో కలిసి బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న పెళ్లి ట్రాక్టర్ను బలంగా ఢీ కొట్టారు. ప్రమాదంలో అంజి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ట్రాక్టర్ వెనుక వైపు కూర్చున్న నాగరాజుకు తీవ్ర గాయలయ్యాయి.
మరోవైపు, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కనకదుర్గ అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వెనుక సీటులో కూర్చున్న శ్రీ లక్ష్మీకి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications