ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..షటిల్ ఆడుతూ కుప్పకూలిన సిఐ భగవాన్ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది . ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సిఐ అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన యావత్ పోలీసు శాఖను కలచివేసింది. అప్పటివరకు షటిల్ ఆడుతున్న సీఐ ఒక్కసారిగా కుప్పకూలి మృత్యు ఒడికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

షటిల్ ఆడుతూ మధ్యలోనే కుప్పకూలిన సిఐ
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు . ప్రతిరోజు భగవాన్ కు షటిల్ ఆడడం అలవాటు.ఎప్పటిలాగే గణపవరం పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఈ రోజు కూడా షటిల్ ఆడడానికి వెళ్లారు. ఆట ఆడుతుండగానే మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనతోపాటు షెటిల్ ఆడుతున్న వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అయ్యిందేమో అని ఛాతీపై బలంగా ఒత్తి ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది .
ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడన్న వైద్యులు
ఆయనను లేపేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆయన నిర్జీవంగానే ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు. భగవాన్ గుండెపోటుతో చనిపోయారని భావిస్తున్నారు. ఎప్పుడూ యాక్టివ్ గా , ఆరోగ్యంగా ఉండేవారని ఆయనతో కలిసి షటిల్ ఆడే క్రీడాకారులు అంటున్నారు . భగవాన్ మృతి పట్ల పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భగవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Recommended Video

భగవాన్ ఆకస్మిక మరణంతో పోలీస్ శాఖలో విషాదం
భగవాన్ కు స్థానికంగా సౌమ్యుడిగా మంచి పేరుంది. ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండే భగవాన్ అకస్మాత్ మరణాన్ని ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది . ఆయన మృతి పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. సీఐ షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారగా , అది చూసిన వారంతా అప్పటి వరకూ బాగానే ఉన్నాడు, అంతలోనే ఇలా జరిగింది.. అయ్యో పాపం అంటూ చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications